మిర్చి.. తెగుళ్లు ముంచి
అలంపూర్: రైతన్న ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మిరప పంటకు ముడత తెగుళ్లు సోకుతున్నాయి. దీనికి సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచిస్తున్నారు. జిల్లాలో వందల ఎకరాల్లో మిర్చి పంట సాగులో ఉంది. దీంతో పాటు హైబ్రిడ్ మిరపను రైతులు సాగు చేస్తున్నారు. సాగు చేసిన మిరప పైర్లకు పైముడత కింది ముడత తెగుళ్లు ఆశిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు నివారణ చర్యలను సూచిస్తున్నారు.
తెల్ల నల్లి (కింది ముడత):
తెల్ల నల్లి పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు కిందికి ముడ్చుకుంటా యి. దీంతో ఆకులు తిరగబడి పడవ ఆకారంలో కనబడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారి మొక్కల పెరగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దకడతాయి.
నివారణ :
నీటిలో కరిగే గంథకం 3 గ్రాములు లేదా డైకోపాల్ 5.0 మి.లీ లేదా పెగాసెస్‌ను 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతిని బట్టి ఎకరా కు ఫానలోన్ 400 మి.లీ లేదా ఇంట్రిపిడ్ 400 మి.లీ పిచికారీ చేసుకోవాలి.
తామర పురుగు (పైముడత) :
ఇవి ఆకుల నుంచి రసం పీల్చడం వ లన అకులు పైకి ముడ్చుకుంటా యి. ఆకులు, పిందెలు, రాగి రంగులోకి మారి పూత పిందె దశలో నే నిలిచిపోతుంది.
నివారణ :
పై ముడత నివారణకు 10 లీటర్ల నీటికి 12.5 గ్రా ముల డైపెన్ ధయురాన్ లేదా 20 మి.లీ ప్రిపోనిల్ లేదా 30 మి.లీ స్పైనోసాడ్ లేదా 20 మి.లీ పానలోస్, 15 గ్రాముల ఎసిఫెట్ కలిపి ఆకుల అడుగు భాగం తడిసేలా పిచికారీ చేయాలి.
పాడి–పంట
మిర్చి.. తెగుళ్లు ముంచి


