వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
కోస్గి రూరల్: బొలేరో వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుండుమాల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కోస్గి పట్టణానికి చెందిన అచ్చుగట్ల అశోక్ (47) నారాయణపేట జిల్లా కేంద్రంలో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గుండుమాల్ మండలం అమ్లీకుంటలో తమ ఇంటి దైవం వీరభద్రస్వామికి పూజల నిమిత్తం ఆదివారం ఉదయం తన భార్యాపిల్లలను కోస్గికి పంపించాడు. రోజు మాదిరిగానే వస్త్ర దుకాణాన్ని మూసివేసి రాత్రి కోస్గికి బయలుదేరాడు. గుండుమాల్ చెరువుకట్టపై కోస్గి నుంచి మద్దూర్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఓ ప్రైవేటు వాహనంలో కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య రాధ ఫిర్యాదు మేరకు బొలేరో వాహనం డ్రైవర్ కాశీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు.
వ్యక్తి బలవన్మరణం
గద్వాల క్రైం: ఆర్థిక సమస్యలు తాళలేక వ్యక్తి బలవన్మరణం చెందిన సంఘటన గద్వాల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. ప ట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రెండవ రైల్వే గేట్‌కు చెందిన లక్ష్మన్న(55) వృత్తి రిత్యా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో తెలిసిన వారితో అప్పులు చేశాడు. తీసుకున్న అప్పులు తీర్చే స్థోమత లేకపోవడంతో సోమవారం తెల్లవారు జామున గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఉదయం కుటుంబ సభ్యులు గ మనించి పోలీసులకు సమాచారం అందించా రు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బావిలో పడి
వృద్ధురాలి మృతి
ఎర్రవల్లి: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కోదండాపురం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ము రళి కథనం మేరకు.. మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన సాయిరెడ్డి తిరుపాలమ్మ (70)కు కొంత కాలంగా మతిస్థిమితం సక్ర మంగా లేకపోవడంతో కంటిచూపు లోపం ఉండేది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అదే గ్రా మంలోని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఊర బావిలో పడింది. సో మవారం ఉదయం దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను బావిలో నుంచి బయటికి తీసి చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన డ్యూటీ డాక్ట ర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆమె కుమారుడు సాయిరెడ్డి తిక్కారెడ్డి ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
హైవే విధుల నుంచి
తొలగింపు
జడ్చర్ల: జడ్చర్ల పరిధిలో జా తీయ రహదారి–44 పర్యవేక్షణకు నియమించిన హైవే పోలీసులను విధుల నుంచి తొలగించారు. ఆదివారం జాతీయ రహదారిపై వెళ్తు న్న హార్వెస్టర్ల డ్రైవర్లు, యజమానుల నుంచి హైవే పోలీసులు డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘హైవే పోలీసుల చేతివాటం’ శీర్షికన వచ్చిన కథనంపై ఎస్పీ జానకి స్పందించారు. ఈ మేరకు సదరు పోలీసులను విధుల నుంచి తప్పించి ఇతర పోలీసులకు అప్పగించారు.
వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం


