స్వదేశీ వాడకంతోనే చేనేతకు ఆసరా
నారాయణపేట: చేనేత వృత్తి అద్భుతమని, అది ఒక కళ అని.. స్వదేశీ ఆదరించడం.. చేనేతను అక్కున చేర్చుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని బీజేపీ జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అభిప్రాయపడ్డారు. సోమవారం నారాయణపేట జిల్లా కోటకొండలోని చేనేత వస్త్రాలు, పట్టుచీరలను ఆయనతోపాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్‌తోపాటు ఎగ్గని నర్సింలు పరిశీలించారు. గద్వాల్, పైతాన్, సికో, తదితర రకాల పట్టు చీరలను వారు చూశారు. అత్యద్భుతమైన డిజైన్లు, ఆకర్షించే రంగుల చీరలు మహిళల మనసును గెలుచుకుంటాయని కితాబిచ్చారు.
స్లార్ హీరోయిన్లతో ప్రచారానికి ప్రణాళిక..
కోటకొండ చేనేత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు పాటుపడతానని మురళీధర్‌రావు పేర్కొన్నారు. ఇక్కడ తయారు చేసిన చేనేత వస్త్రాలకు జాతీయస్థాయిలో ప్రచారం తీసుకువచ్చేందుకు పని చేద్దామన్నారు. ఇక్కడ పంచెలు తయారుచేసి, వాటికి కోటకొండ బ్రాండ్ తీసుకురావాలని. రాష్ట్రంలో పేరుగాంచిన వివిధ ప్రాంతాల మాదిరే, కోటకొండ అనేది ఒక బ్రాండ్‌గా తయారు కావాల ని ఆయన పేర్కొన్నారు. అయితే స్వయంగా తయా రు చేసే చీరలకు సినిమా స్టార్లతో ప్రచారం చేద్దామని, కోటకొండలోకానీ, హైదరాబాద్‌లో గాని షో ఏర్పాటు చేద్దామని సూచించారు. అందుకు ఎమ్మె ల్యే వెంకటరమణారెడ్డి స్పందిస్తూ.. స్టార్లను ఒప్పించి, ప్రచారం చేయించే బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పగా.. ఆ బాధ్యతలు నేనే నిర్వహిస్తాన ని మురళీధర్‌రావు బదులిచ్చారు. ఖరీదైన కార్పొ రేట్ వస్తువుల కంటే కూడా, చేనేత వస్త్రాలు భార తీయ ఆత్మను ప్రతిబింబిస్తాయని, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళందరూ కూడా చేనేతను ఆదరించాలని సూచించారు. అనంతరం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు, బీజేపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, నాయకులు ఎంగలి సిద్దు, పగుడాకుల రవి, చెవుల కష్ణయ్య, ఎంగలి నవీన్, ఎంగలి సురేందర్ , బొక్కి సాయిలు, కొత్తపల్లి తిరుపతి యాదవ్ ఉన్నారు.
కోటకొండ చేనేతకు జాతీయస్థాయి గుర్తింపునకు కృషి
బీజేపీ జాతీయ పూర్వ ప్రధాన
కార్యదర్శి మురళీధర్ రావు
చీరలను పరిశీలించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి


