చోరీ కేసుల్లో నిందితుడి రిమాండ్
● వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట సహా ఆరు జిల్లాల్లో దొంగతనాలు
● 16 కేసుల్లో నిందితుడైన సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్వి
● నిందితుడిని పట్టుకున్న వనపర్తి పోలీసులు
వనపర్తి: వనపర్తి జిల్లాలో పలు దొంగతనాల కేసు ల్లో నిందితుడు సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్వికి రిమాండ్ విధించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ పేర్కొన్నారు. ఎస్పీ వివరాల ప్రకారం.. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న రిజ్వి కొంతకాలంగా పోలీసుల కు చిక్కకుండా, కోర్టులో హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతనిపై కోర్టు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు వనపర్తి డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌బీడబ్ల్యూ బృందం నిందితుడి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. వివిధ ప్రదేశాల్లో గాలింపు చర్యల అనంతరం, హైదరాబా ద్ సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ సహకారంతో సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్విని పోలీసులు పట్టుకున్నారు. సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్విని వనపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14రోజులు రిమాండ్ విధించింది.
జిల్లా వ్యాప్తంగా 16కేసుల్లో..
2018లో పెబ్బేర్ పోలీస్టేషనన్‌లో 6కేసులు, వనపర్తి టౌన్ పోలీస్టేషన్‌లో 4 కేసులు, కొత్తకోట పోలీస్టేషన్‌లో 6 కేసులు, రాజేంద్రనగర్, వికారాబాద్, కర్నూ లు జిల్లాలో కూడా దొంగతనం కేసులు నమోదు అయినట్లు డీసీఆర్‌బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి తెలిపారు. ఇంతకుముందు రిమాండ్ అయిన తర్వాత పారిపోయిన సయ్యద్ కరర్ హుస్సేన్ రిజ్వి మళ్లీ పట్టుకోవడంలో విశేష నైపుణ్యం కనబర్చిన వనపర్తి డీసీఆర్‌బీ పోలీసులను ఎస్పీ అభినందించారు.


