చెరుకుకు గిట్టుబాటు ధర రూ.4,500 ఇవ్వాలి
● తెలంగాణ చెరుకు రైతు సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపి
అమరచింత: టన్ను చెరుకుకు బోనస్‌లతో పని లేకుండా రూ.4500లు గిట్టుబాటు ధర ఇవ్వాలని తెలంగాణ చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. సోమవారం తమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అడ్వైజర్ రామకృష్ణ ప్రసాద్, కెన్ డీజీఎం నాగార్జునను కలిసి చెరుకు రైతుల సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీకి తరలించిన చెరుకులో రికవరీ శాతం పెంచి చెరుకు రైతులను ఫ్యాక రీ యాజమాన్యం ఆదుకోవాలన్నారు. కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం గత సీజన్‌లో ప్రకటించిన సబ్సిడీలను ఈ సీజన్‌లో సైతం అమ లు చేస్తున్న యాజమాన్యం రికవరీ శాతాన్ని 11 నుంచి 12 శాతానికి పెంచాలన్నారు. సబ్సిడీలను 2026 నుంచి 2027 వరకు కొనసాగించాలన్నారు. కోతలకు సరిపడా లేబర్ బంటాలను మిషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫ్యాక్టరీకి పంపిన 14 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బు జమ చేయాలని విన్నవించారు. చెరుకును తరలించే గ్రామాల అంతర్గత రహదారులను ఫ్యాక్టరీ సీడీసీ నిధుల నుంచి ఖర్చు చేసి మరమ్మతు చేపట్టాలన్నారు. ఆత్మకూర్ నుంచి ఫ్యాక్టరీ వరకు ఉన్న బీటీ రోడ్డు మరమ్మతుకు నిధులు మంజూరైనా సంబంధిత అధికారులు నేటికీ పనులు చేపట్టలేక పోవడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జి ల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్, వెంకట్‌రాములు, ఎస్.రాజు, అంజి, బాలు నాయక్, భాస్కర్ రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.


