గణతంత్ర వేడుకలకు పీయూ అధ్యాపకుడు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో నిర్వహించే వేడుకల కంటిజెంట్ ఆఫీసర్‌గా పీయూ అధ్యాపకుడు అర్జున్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వెళ్లే ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ప్రతిభ చూపి, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వలంటీర్లను సమన్వయం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వం చాటాలని సూచించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెఎల్‌డీ కళాశాల నుంచి పరమేష్, గద్వాల్ నుంచి పద్మావతి కూడా గుజరాత్‌లో జరిగే పటాన్‌లోని హేమచంద్రాయ నాత్ గుజరాత్ విశ్వవిద్యాలయంలో నిర్వహించే క్యాంపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.


