జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో
ధరూరు/ దోమలపెంట/ దేవరకద్ర/ ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో వ స్తుంది. శనివారం రాత్రి 7,30 గంటల వరకు ప్రాజె క్టుకు 20 వేల క్యూసెక్కుల వరద రావడంతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం 22, 680 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా.. మరో 47 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.255 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
● సుంకేసుల నుంచి 49,228, జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 22,680 మొత్తం 71,908 క్యూసెక్కుల నీటి ప్రవాహం శనివారం శ్రీశైలం జలాశయం వచ్చింది. దీంతో శ్రీశైలంలో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 62,107 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 880.5 అడుగుల వద్ద 191.2118 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అలాగే 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5,000, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 2,674, ఎంజీకేఎల్‌ఐకి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
నాలుగు యూనిట్లలో విద్యుతుత్పత్తి
జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో కేవలం 4 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం ఎగువలో 2 యూనిట్ల ద్వారా 78 మెగావాట్లు, దిగువలో 2 యూనిట్ల ద్వారా 80 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్, డీఈ పవన్‌కుమార్ తెలిపారు.
కోయిల్‌సాగర్‌లో ఒక గేటు ఎత్తివేత..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి శనివారం ఒక గేటు తెరిచి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు ప్రవాహం రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి 32.6 అడుగులకు చేరడంతో అధికారులు ఒక గేటును తెరిచి నీటిని వదిలారు.


