స్కాలర్‌షిప్ విడుదల చేయాలని నిరసన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు వెంటనే స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాచకులు కృష్ణకుమార్, రవితేజ మాట్లడుతూ.. తెలంగాణలో విద్యావ్యవస్థ క్షీణిస్తుందని, ప్రభుత్వం కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం వల్ల పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. సంవత్సరాల త్వరబడి ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు, ఫీజులు రియంబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కళాశాలల్లో సర్టిఫికేట్‌లు సైతం ఇవ్వకపోవడంతో మద్యలోనే చదువులను నిలిపివేసే పరిస్థితి నెలకొందన్నారు. వీలైనంత త్వరగా ఫీజులు విడుదల చేయకపోతే రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సంగీత, శరత్, హరికృష్ణ, గోపి, అర్జున్, నందిని, రేణుక, సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు.


