నోటీసులు జారీ..
ఆన్‌లైన్ ద్వారా 2020 సంవత్సరంలో వచ్చిన సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. దరఖాస్తుల ఆధారంగా సాదా కాగితాలపై భూములు అమ్మిన, కొనుగోలు చేసిన వారికి నోటీసులు జారీ చేశారు. ఇరువురిని పిలిచి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
మార్గదర్శకాల ప్రకారమే..
సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం చేసిన దరఖాస్తుల పరిషారం విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపడుతున్నాం. మండలాల వారీగా సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి నోటీసులు జారీ చేశాం. విచారణ ప్రక్రియ కొనసాగుతోంది.
– మధుసూదన్‌నాయక్,
ఇన్‌చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్
●


