కృష్ణమ్మ ఒడిలో.. జలవిహారం
సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో తిరిగే ఏసీ లాంచీ
ప్రయాణాల్లో మార్పులు
సోమశిల నుంచి శ్రీశైలానికి నడిపే ఏసీ లాంచీలో గతేడాది కొన్ని రకాల మార్పులు చేశారు. గతంలో 60 నుంచి 70 మంది ప్రయాణికులు బుకింగ్ చేసుకుంటేనే లాంచీ ప్రయాణం చేపట్టేవారు. అయితే ఒకేసారి అంతమంది బుకింగ్ చేసుకోవడం సమస్యగా మారింది. దీంతో ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా ఈ లాంచీ ప్రయాణం కొనసాగేది కాదు. గతేడాది ప్రతి శని, ఆది వారం ప్రయాణికులు ఉన్నా.. లేకున్నా.. లాంచీని తిప్పాలని టూరిజం శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకులు ఆయా రోజుల్లో లాంచీ ప్రయాణాలకు మొగ్గుచూపడంతో ఇదే పద్ధతిని కొనసాగించాలని భావిస్తున్నారు. టికెట్ల ధరలు, వసతుల కల్పనలోనూ ఈ ఏడాది నుంచి మార్పులు చేపట్టాలని నిర్ణయించారు.
సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు
వరదలతో రెండు నెలలుగా వాయిదా పడిన వైనం
తాజాగా తగ్గుముఖం పట్టడంతో ప్రారంభించేందుకు కసరత్తు
పర్యాటకులకు మెరుగైన
వసతుల కల్పనకు చర్యలు
బ్యాక్‌వాటర్‌లో ఆకట్టుకుంటున్న చిన్నబోట్ల షికారు


