పార్లమెంట్‌లో చట్టం చేస్తేనే.. బీసీలకు 42 శాతం రిజర్వేష
● కోర్టులను నిందించడం సరి కాదు
● మాజీ గవర్నర్, బండారు దత్తాత్రేయ
నారాయణపేట: ‘రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు కల్పించడాన్నిస్వాగతిస్తున్నాం. స్థా నిక సంస్థల ఎన్నికల్లో ఎలా అమలు చేస్తారనేది వేచిచూడాలి. పార్లమెంటులో చట్టం చేస్తేనే రిజర్వేషన్లు అమలు అవుతాయి. కోర్టులను నిందించడం సరైన ది కాదు. పార్లమెంటులో బీసీ బిల్లు అమలు అయ్యే లా దేశంలోని అన్ని జాతీయ పార్టీలు సహకరించాలి.’ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పే ర్కొన్నారు. శనివారం ఆయన నారాయణపేట జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో అత్యధికంగా వెనుకబడిన కూలాలు ఉన్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభు త్వం సంకల్పించిన సమయంలోని సాధ్యసాధ్యాలను ఆలోచన చేయాల్సి ఉండేదని.. దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. సామాజిక న్యాయమనేది చాలా అవసరమని, వెనకబడిన సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిపిస్తే.. పరిపాలన వారిచేతుల్లోకి వెళ్లడం శుభపరిణామన్నారు. పార్లమెంట్‌లో చట్టం చేస్తే తప్పా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును మనం ముందుకు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు. కోర్టులపై నిందలు వేయడం సరైంది కాదని, రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు తీర్పునిస్తాయని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం రావాలని, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి చొరవ తీసుకోవాలని మనసారా కోరకుంటున్నట్లు వెల్లడించారు. సమావేశంలో నాగురావు నామాజీ, సత్య యాదవ్, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.


