
మార్మోగిన గోవింద నామస్మరణ
కనులపండువగా పాగుంట వేంకటేశ్వరస్వామి రథోత్సవం
కేటీదొడ్డి: అశేషంగా తరలివచ్చిన భక్తజనం నడుమ పాగుంట వేంకటేశ్వరస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. నడిగడ్డ భక్తుల కోరికలు తీర్చే వెంకన్నగా విరాజిల్లతున్న పాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి రథోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించగా.. కర్ణాటక, ఆంద్రపదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. ఆంజనేయస్వామి ఆలయం వరకు రథాన్ని లాగారు. ఇదిలాఉండగా, వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. జాతర సందర్భంగా తినుబండారాలు, ఆటబొమ్మల దుకాణాల్లో రద్దీ నెలకొంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ నల్లా హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, శ్రీధర్‌గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్, మాజీ వైస్‌ఎంపీపీ రామకృష్ణనాయుడు, మాజీ సర్పంచు ఆంజనేయులు, గోపి, ఉరుకుందు, నవీన్, రాజేష్, శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మార్మోగిన గోవింద నామస్మరణ