రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
మానవపాడు: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమ వారం మండలంలో చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. మా నవపాడుకు చెందిన ఆంద్రిచెట్టు ఆనంద్ (26) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం కొనసాగించేవాడు. అయితే తరచూ మూర్చ వస్తుండడంతో మాన సికంగా బాధపడుతూ ఉండేవాడు. అనేక ఆస్ప త్రులలో చూపించినప్పటికీ నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి మానవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచరం రావడంతో రైల్వే పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అశోక్‌కు భార్య కౌసల్య, 2 నెలల బాబు ఉన్నాడు.
వాహనం ఢీ.. వ్యక్తి మృతి
అయిజ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘ టన మండలంలో సోమ వారం జరిగింది. అయిజ పట్టణానికి చెందిన మాల వీరేష్ (34) స్కూల్ బస్సు డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించేవాడు. సోమవారం రాత్రి పనినిమిత్తం ద్విచక్ర వాహనంపై గద్వాల వెళ్తుండగా మండలంలోని బింగుదొడ్డి గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వీరేష్‌కు గాయాలు కాగా స్థానికులు 108కు సమాచారం అందించగా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చని పోయాడు. వీరేష్‌కు భార్య, కూతురు ఉండగా తోటి స్కూల్ బస్సు డ్రైవర్లు తమ వంతుగా కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగుపాటుకు
రైతు బలి
రాజోళి: మండలంలోని ముండ్లదిన్నెలో మంగళవా రం పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన చో టుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కుర్వ మద్దిలేటి(42) రోజువారీగా మంగళవారం కూడా తన పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడటంతో రైతు అక్కడిక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసినప్పటికీ అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య జ్యోతి, కూతురు, కుమారుడు ఉన్నారు.
పురుగుల మందు తాగి బలవన్మరణం
బిజినేపల్లి: అంగోతు పరెంగ (80) అనే వృద్ధుడు సో మవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని కీమ్యాతాండ గ్రా మ పంచాయతీ కేతరబండ తండా పరిధిలో జరిగింది. అంగోతు పరెంగ భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. పరెంగకు ఎనిమిది మంది కుమారులు ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడంతో కొద్ది కాలంగా మనస్థాపానికి గురయ్యాడు. తండాలోని అందరూ సంతోషంగా పండుగ చేసుకుంటుంటే తనను ఎవరు పట్టించుకోకపోవడంతో మనోవేదనకులోనై పురుగు మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి అంబులెన్స్‌లో ఆస్పత్రిగా తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
ఎర్రవల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కోదండాపురం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మురళి కథనం మేరకు.. మండల పరిధిలోని వల్లూరు గ్రామానికి చెందిన ఈడిగ శ్రీనివాసులు (55) వ్యవసాయంలో నష్టాలు రావడంతో మనస్థాపానికి గురై తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో సోమవారం పొలానికి వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి సోదరుని కుమారుడు రాజగోపాల్‌గౌడ్ ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీ, టిప్పర్ ఢీ :
డ్రైవర్ మృతి
రాజాపూర్: మండలంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన గోవింద్ (43) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం కేరళ నుంచి హైదరాబాద్‌కు లారీలో లోడ్‌తో వెళ్తుండగా.. టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గోవింద్ కుమారుడు కౌషిక్ ఫిర్యాదు మేరకు మంగళవారం టిప్పర్ డ్రైవర్ కావలి కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య


