
మహబూబ్‌నగర్ విజయం
● 120 పరుగుల తేడాతో
బాలాజీ కోల్ట్స్‌పై గెలుపు
మహబూబ్‌నగర్ క్రీడలు: హెచ్‌సీఏ బి–డివిజన్ టూడేలీగ్ మ్యాచ్‌లో జిల్లా జట్టు 120 పరుగుల తేడాతో బాలాజీ కోల్ట్స్‌పై విజయం సాధించింది. మహబూబ్‌నగర్ జట్టు మొదటి రోజు 76.5 ఓవర్లలో 238 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బుధవారం రెండో రోజు బ్యాటింగ్ చేసిన బాలాజీ కోల్ట్స్ జట్టు పాలమూరు బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 39.3 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌట్ అయింది. జిల్లా బౌలర్లు ఎండి.ముఖితుద్దీన్ 28 పరుగులకు 3 వికెట్లు, జస్వంత్ 38 పరుగులకు వికెట్లు, మనోజ్ 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. జిల్లా జట్టు మ్యాచ్‌లో విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్ అబ్దుల్లా అభినందించారు. రానున్న మ్యాచుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.