
నేడు నల్లమలలో ట్రాఫిక్ ఆంక్షలు
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16న గురువారం శ్రీశైలం పర్యటన నేపథ్యంలో నల్లమల అటవీప్రాంతంలో ట్రాఫి క్ ఆంక్షలు ఉండనున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రధాని శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్నందున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని, హైదరాబాద్ నుంచి వీఐపీలు శ్రీశైల క్షేత్రం వెళ్లే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలు ఉంటాయని తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత సందర్శించాలని తెలిపారు. భక్తులు, ప్రయాణికులు పోలీసుశాఖకు సహకరించాలని తెలిపారు.
శ్రీశైలం రాకపోకలు నిలిపివేత
మన్ననూర్: మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్న సందర్భంగా 16వ తదీ(గురువారం) శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారి మన్ననూర్ నుంచి తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శాంతిభధ్రతల దృష్ట్యా ఈ రకమైన ట్రాఫిక్ ఆంక్షలు గురువారం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఉంటాయన్నారు.
ఎన్‌ఎస్‌జీ పర్యవేక్షణలో ఏపీ పోలీసులు
దోమలపెంట: శ్రీశైలంలో గురువారం ప్రధానమంత్రి పర్యటన పురస్కరించుకుని ఒక్కరోజు ముందుగానే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అధికారుల పర్యవేక్షణలో బుధవారం ఈగలపెంటలో ఏపీ పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. ఎన్‌ఎస్‌జీ ఆదేశాల మేరకు విజయవాడ డీఎస్పీ వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి శ్రీశైలంకు వస్తున్న వాహనాలు, ఆర్టీసీ బస్సులను ఈగలపెంటలో ఉన్న జెన్‌కో గ్రౌండ్‌లోకి మళ్లించి అక్కడే వాహనాలను నిలిపి వేయిస్తున్నారు. శ్రీశైలంలో ఉన్న ఎన్‌ఎస్‌జీ అధికారులు తెలిపినప్పుడు మాత్ర మే ఈ వాహనాలను అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సమాచారం తెలియకుండా విచ్చేస్తున్న పర్యాటకులు, భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కాగా ఈగలపెంట, దోమలపెంట ప్రాంతాల్లో హోటల్స్ తెరిచి ఉండడంతో భోజనాలు, టిఫిన్లు తాగునీటికి ఇబ్బందులు లేవు. ఈగలపెంట దాటితే ఒక్క హోటల్ కాని ఇతరత్రా షాపులన్నీ మూసిఉంచారు.
ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
ప్రదాని మోదీ శ్రీశైలం పర్యటనలో
బందోబస్తు
ఈగలపెంట జెన్‌కో గ్రౌండ్‌లోకి
వాహనాల మళ్లింపు