
యువకుడి ఆత్మహత్య
బిజినేపల్లి: మండలంలోని ఖీమ్యాతండా జీపీ పెద్ద వే ములతండాకు చెందిన కే తావత్ శివ (21) పురుగుల మందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దవేములతండాకు చెందిన శివ సోమవారం తండాలో పురుగుల మందు తాగాడు. విష యం గుర్తించిన కుటుంబ సభ్యులు శివను ఆస్పత్రికి తరలించారు.హైదారాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.
నీటిగుంతలో పడి
వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: మతిస్థిమితంలేని ఓవ్యక్తి నీటిగుంతలో పడి మృతిచెందిన ఘటన కౌకుంట్ల మండ లం గూడూర్ ఊకచెట్టువాగు సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిర్మలాపురం గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య(55) కొన్నిరోజులుగా మతిస్థిమితంలేకుండా తిరుగుతున్నాడు. కృష్ణయ్యకు భార్యాపిల్లలు లేకపోవడంతో అక్క చెన్నమ్మతో ఉండేవాడు. రెండు రోజులుగా కనిపించకుండాపోయాడు. బుధవారం తెల్లవారుజామున గూడూర్ ఊకచెట్టు వాగు సమీపంలోని నీటిగుంతలో శవమై తేలాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని మృతదేహాన్ని గ్రామానికి తరలించారు.ఈ విషయంపై ఎలాంటి ఫిర్యా దు అందలేదని ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపారు.
యువకుడి బలవన్మరణం
నాగర్‌కర్నూల్ క్రైం: యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని నల్లవెల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ ఐ గోవర్ధన్ కథనం ప్రకారం.. నల్లవెల్లికి చెందిన నవీన్(21) వ్యవసాయం చేసుకుని జీవ నం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం తండ్రి వెంకటయ్య వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి రాగా.. కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో
వివాహిత మృతి
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందినట్లు పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ తెలిపారు. ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన దుర్గమ్మ(32) భర్త ఎల్లప్ప జీవనోపాధి నిమిత్తం నాలుగు నెలల క్రితం గద్వాలకు వచ్చారు. బీసీ కాలనీలోని ప్రైవేట్ స్థలంలో గుడిసె ఏర్పాటు చేసుకుని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం నివాసం ఉంటున్న గుడిసెలో టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన భర్త జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై భర్త ఎల్లప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మహిళ ఆత్మహత్య
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం సమీపంలో శ్రీవారి సముద్రం చెరువు కట్టపై పురుగుల మందు తాగి మహిళ మృతి చెందిన ఘటన చోటోచేసుకుందని ఎస్‌ఐ హృషికేశ్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌కు చెందిన మొట్టె లక్ష్మి(40) పురుగు మందుతాగి చనిపోయింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదు అందులేదన్నారు. కుటుంబ కలహాలే మృతికి కారణమని గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త చంద్రయ్య, ఉన్నారు.
గుప్తనిధుల కోసం
తవ్వకాలు
కేటీదొడ్డి: గుప్తనిధుల తవ్వకాలు చేపట్టిన ఘటన బుధవారం మండలంలో కలకలం రేపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రం నుంచి గువ్వలదిన్నె రోడ్డు పక్కనున్న ఆంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. గుప్తనిధుల కోసం చేపట్టిన తవ్వకాలు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. దుండగులు చేతకాక మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయినట్లు గమనించారు. ఆలయంలో ఎలాంటి వస్తువులు, విగ్రహాలు ధ్వంసం కాలేదని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన ఆలయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తులు ఆలయంలో పూజ నిర్వహించడానికి వెళ్లగా.. అక్కడి పరిస్థితిని గమనించి నిధుల కోసం తవ్వకాలు జరిగాయని చుట్టపక్కల గ్రామస్తులకు తెలియజేశారు.

యువకుడి ఆత్మహత్య