
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ మహోత్సవం
జడ్చర్ల టౌన్: మండలంలోని మీనాంబరం పరుషవేదీశ్వరస్వామి ఆలయంలో సోమవారం అగ్నిగుండ మహోత్సవం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ముందుగా తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల ఓం నమః శివాయ నామస్మరణ మధ్య అగ్నిగుండంలో భక్తులు నడిచి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం కనుల పండువగా జరిపించారు. కల్యాణోత్సవంలో రమాదేవి, విజయమ్మ, సుదర్శన్‌రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోపాల్, పర్వతాలు, కై లాస్ జవహర్, మల్లేష్, యాదయ్య పాల్గొని అన్నదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఆదివారం అర్ధరాత్రి వేసిన ఖడ్గాలు ఆకట్టుకున్నాయి.