
క్రీడలకు ప్రాధాన్యం
● ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ ఎన్పీ వెంకటేశ్
● పాలమూరులో ప్రారంభమైన రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు
● పాల్గొన్న 28 జిల్లాల జట్లు
నల్లగొండ–కొత్తగూడెం బాలికల జట్ల మ్యాచ్
నిర్మల్–మెదక్ బాలికల మ్యాచ్
మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ ఎన్పీ వెంకటేశ్ అన్నారు. పాలమూరులోని ప్రధాన స్టేడియంలో శుక్రవారం రాష్ట్రస్థాయి జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 7వ ట్రెడిషనల్, 3వ ఫాస్ట్–5, 1వ మిక్స్‌డ్ విభాగాల టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాల బాల, బాలికల జట్లు పాల్గొంటున్నాయి. ఈ నెల 12 వరకు టోర్నమెంట్ జరగనుంది. టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎన్పీ వెంకటేష్ హాజరై మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టోర్నీలో 28 జిల్లాల జట్లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని.. ఓడినవారు నిరాశ చెందకుండా గెలుపునకు శ్రమించాలని సూచించారు. క్రీడా పోటీలకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధానకార్యదర్శి కురుమూర్తిగౌడ్ మా ట్లాడుతూ.. క్రీడాకారులకు క్రమశిక్షణ చాలా అవసరమని, కోచ్‌లు చెప్పే సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. నెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు బి.విక్రం ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులు పట్టుదలతో ఆడి జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని కోరారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బాలికలు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడటం సంతోషంగా ఉందని.. ఇదే స్ఫూర్తితో మరింత మంది క్రీడాకారులు తమ ప్రతిభ చాటాలని సూచించారు. అనంతరం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న యశశ్రీ, లితిషను ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఆయా జిల్లాల జట్లు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించగా అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో నెట్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు విక్రం ఆదిత్యరెడ్డి, శిరీషరాణి, ఖాజాఖాన్, రాజారాం, రామ్మోహన్‌గౌడ్, అంజద్‌అలీ, అక్రమ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రెడిషనల్ విభాగంలో పాలమూరు బాల, బాలికల జట్లు శుభారంభం చేశాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో జిల్లా జట్టు 15–9 పాయింట్ల తేడాతో సిరిసిల్లపై, మరో మ్యాచ్‌లో 16–1 తేడాతో పెద్దపల్లి జట్టుపై విజయం సాధించాయి. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు 5–1 పాయింట్ల తేడాతో సిరిసిల్ల జట్టుపై గెలుపొందింది. బాలుర విభాగంలో మహబూబాబాద్ జట్టు 15–7 తేడాతో నిజామాబాద్‌పై, ఖమ్మం జట్టు 16–5 తేడాతో ఆసిఫాబాద్‌పై, నల్లగొండ జట్లు 14–1 తేడాతో ఆదిలాబాద్‌పై, వనపర్తి జట్టు 7–1 తేడాతో వరంగల్‌పై, మెదక్ జట్టు 8–2 తేడాతో నిర్మల్‌పై గెలిచాయి. బాలికల విభాగంలో మేడ్చల్ జట్టు 14–2 పాయింట్ల తేడాతో ఆదిలాబాద్‌పై, నల్లగొండ జట్టు 12–4 తేడాతో వరంగల్‌పై, హైదరాబాద్ జట్టు 4–2 తేడాతో మెదక్‌పై, కామారెడ్డి జట్టు 4–1 తేడాతో నారాయణపేటపై, కరీంనగర్ జట్టు 6–2 తేడాతో జనగాంపై, మేడ్చల్ జట్టు 6–1 తేడాతో పెద్దపల్లిపై, ఖమ్మం జట్టు 14–2 తేడాతో మహబూబాబాద్‌పై, నాగర్‌కర్నూల్ జట్టు 6–3 తేడాతో ఖమ్మంపై, నిజామాబాద్ జట్టు 8–5 తేడాతో కరీంనగర్‌పై, జగిత్యాల జట్టు 6–1 తేడాతో మంచిర్యాలపై, ఆసిఫాబాద్ జట్టు 10–9 తేడాతో గద్వాల జట్టుపై గెలుపొందాయి.
‘పాలమూరు’ శుభారంభం..

క్రీడలకు ప్రాధాన్యం

క్రీడలకు ప్రాధాన్యం

క్రీడలకు ప్రాధాన్యం