రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Oct 11 2025 7:50 AM | Updated on Oct 11 2025 7:50 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గద్వాల క్రైం: ఎదురుగా వ స్తున్న వాహనం ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. దౌదర్‌పల్లి కాలనీ కి చెందిన పెద్దయ్య(39) జీవనోపాధి నిమిత్తం గ్యా స్‌ పొయ్యిలకు మరమ్మతు చేస్తుంటాడు. ఈ శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని గద్వా ల ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో పెద్దయ్య వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

గోపాల్‌పేట: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రేవల్లి మండలంలోని కేశంపేట పాతతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. రేవల్లి హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ తెలిపి న వివరాలిలా.. కేశంపేట పాతతండాకు చెందిన నున్సావత్‌ బౌసింగ్‌(35), చిట్టి భార్యభర్తలు. వీరు నాలుగేళ్లుగా పిల్లలతో కలిసి హైద్రా బాద్‌లోనే ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తూ వచ్చారు. గురువారం బౌసింగ్‌ దంపతులు ఇద్దరూ గ్రామానికి వచ్చారు. ఏమైందో తెలియదు.. శుక్రవారం ఉదయం చూసేసరికి బౌసింగ్‌ తన ఇంట్లోనే ఉరేసుకొని కనిపించాడు. గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. బౌసింగ్‌ అమ్మ తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని హెడ్‌కానిస్టేబుల్‌ వివరించారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

నవాబుపేట: క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మండలంలోని జంగమయ్యపల్లికి చెందిన కమ్మరి ఆచారి(46) ఈనెల 4వ తేదీన మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు. దీంతో అతడి భార్య భారతమ్మ నిత్యం తాగి వస్తావా అంటూ భర్తతో గొడవ పెట్టుకుంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో క్షనికావేశంలో ఇంటి మేడపై ఉన్న కలుపు మందును తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వారం రోజులపాటు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ విషయంలో మృతుడి కుమారుడు కమ్మరి పవన్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

మద్దూరు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని దోరేపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. దోరేపల్లి గ్రామా నికి చెందిన బుడగ జంగం శేఖర్‌తో కొన్నేళ్ల క్రి తం పద్మమ్మ(35) కు వివాహం జరిగింది. వీరి కి ఇద్దరు కుమారులు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పద్మమ్మ తన ఇద్దరు కొడుకులు చదువుతున్న దోరేపల్లి పాఠశాలకు భోజ న సమయంలో వెళ్లి వారికి తినిపించింది. కుమారులు అడిగిన తినుబండారాలను కొని చ్చి తనతో రావాలని కోరింది. కానీ పాఠశాల వేళల్లో విద్యార్థులను పంపమని ఉపాధ్యాయు లు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లింది. అప్పటి నుంచి గ్రామంలో కనిపించలేదన్నారు. శుక్రవారం పాఠశాల సమీపంలో ఉన్న ఊర చెరువులో ఓ శవం బయట పడటంతో గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు వెళ్లి చూశా రు. ఎవరూ గుర్తు పట్టకపోవడంతో నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన మహిళ భర్త శే ఖర్‌ను పిలిపించారు. అతను అక్కడికి వెళ్లి చూ డగా.. తన భార్య పద్మనే అని గుర్తించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా.. శ వాన్ని మహబూబ్‌నగర్‌ ప్రధాన ఆస్పత్రికి పో స్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిసింది.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 
1
1/2

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 
2
2/2

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement