
మద్దూరులో బైక్ బ్యాటరీల చోరీ
మద్దూరు: ఇళ్లు, దుకాణాల ఎ దుట ఉంచిన ద్విచక్ర వాహనా ల బ్యాటరీలను ఓ మెకానిక్ శుక్రవారం రాత్రి దొంగలించిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఓ షాపు ఎదుట ఉన్న సీసీ ఫుటేజీలో బైక్ నుంచి బ్యాటరీ చోరీ చేయడం రికార్డు అయ్యింది. అలాగే ఒకే రాత్రి దాదాపు 18బైక్‌ల నుంచి బ్యాటరీలు అపహరించడం కలకలం రేపింది. దీంతో రఘు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్దూరులో మెకానిక్ షాపు నిర్వహించే నర్సింహులు ఈ దొంగతనం చేసినట్లు గుర్తించి అతని మెకానిక్ షాపు నుంచి దొంగిలించిన 18 బ్యాటరీలను రికవరీ చేసినట్లు తెలిపారు. నర్సింహులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతన్ని పట్టుకొని విచారించిన తర్వాత వివరాలు వెల్లడించనున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.