
దాడిచేసిన వారిపై కేసు నమోదు
అమరచింత: నాగల్‌కడ్మూర్ గ్రామానికి చెందిన అహ్మద్‌పాషాపై దాడి చేసిన నాగిరెడ్డిపల్లెకు చెందిన పలువురిపై శనివారం కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ స్వాతి తెలిపారు. శుక్రవారం రాత్రి నాగల్‌కడ్మూర్‌కు చెందిన అహ్మద్‌పాషా తన సొంత పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నారాయణపేట మండలం నర్వ మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన కొంతమంది యువకులు నాగల్‌కడ్మూర్‌కు చెందిన చిన్నపిల్లలతో గొడవ పడుతుండగా వారించడానికి వెళ్లిన అహ్మద్‌పాషాపై కత్తితో దాడిచేసి గాయపరిచారన్నారు. దీంతో పెద్దగా అరవడంతో సమీపంలో ఉన్న వ్యక్తులు అక్కడికి రాగా దాడికి పాల్పడిన వారు అక్కడినుంచి పరారయ్యారన్నారు. రక్తగాయంతో బాధపడుతున్న పాషాను ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మొసళ్ల సంచారంతో
ఆందోళన
వీపనగండ్ల: మండలంలోని రిజర్వాయర్, పలు చెరువులు, కుంటల్లో మొసళ్ల సంచారంతో ఆందోళన చెందుతున్నట్లు రైతులు వాపోతున్నారు. శుక్రవారం రాత్రి కల్వరాల్ల గ్రామ సమీపంలో రోడ్డుపై మొసలి సంచరిస్తుండటాన్ని గుర్తించారు. అదే విధంగా గోపల్‌దిన్నె రిజర్వాయర్, గోవర్ధనగిరికత్వా, పల్లెచెరువు పలు గ్రామాల్లోని ఊరచెరువులో తరచూ మొసళ్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి ఆయా చెరువుల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.