
తిరుగు ప్రయాణ పాట్లు
దసరా పండుగ, సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి పట్నం బాట పట్టారు. శుక్రవారంతోనే దసరా సెలవులు ముగియడంతో శనివారం కార్యాలయాలకు వెళ్లే వారితోపాటు, సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనుండగా హాస్టళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులను పంపేందుకు ఉదయం నుంచే తల్లిదండ్రులు బయలుదేరారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బస్టాండ్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, ప్రయాణికులతో రద్దీగా మారాయి. ప్రధానంగా హైదరాబాద్ రూట్‌లో వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి సిగ్నల్‌గడ్డ, ఫ్‌లైఓవర్ సర్కిల్, బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడాయి. బస్సులు వచ్చిన వెంటనే సీట్ల కోసం ప్రయాణికులు పోటీపడటం కనిపించింది. ఇదిలా ఉండగా.. అలంపూర్ చౌరస్తాలో ప్రజలు ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అలంపూర్ ఆలయాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. ఈ క్రమంలో అధికారులు స్పందించి ఇక్కడ మినీ బస్టాండ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – జడ్చర్ల టౌన్/ ఉండవెల్లి

తిరుగు ప్రయాణ పాట్లు

తిరుగు ప్రయాణ పాట్లు