
ద్రావణ తయారీలో నాణ్యత తప్పనిసరి
అలంపూర్: పంట సస్యరక్షణ చర్యల్లో భాగంగా పు రుగు మందు ద్రావణ తయారీలో నాణ్యత లోపించిన నీరు వాడితే ప్రతికూల మార్పులు జరిగి మందు ప్రభావం తగ్గుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ రైతులకు సూచించారు. నాణ్యత లేని నీటిని వినియోగిస్తే నష్టపోతారన్నా రు. మందు ద్రావణం చేయడానికి నాణ్యత గల నీరు వాడినప్పుడే మాత్రమే మందు శక్తివంతంగా పని చేసి ఫలితం పొందవచ్చని పేర్కొన్నారు.
ఎలాంటి నీరు కావాలి..? ఏ లక్షణాలు ఉండాలి..?
మందు ద్రావణ తయారీకి ముఖ్యంగా మూడు లక్షణాలు ఉండాలి. వీటిపై సరైన అవగాహన పెంచుకోవాలి.
1. పీహెచ్ ఉదజని సూచిక లేక రసాయన స్థితి :
నీటిలో కరిగి ఉండే లవణాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆమ్లం, తటస్థం, క్షారముగా ఉండవచ్చు. అయితే ఆమ్లగుణ తీవ్రత అధికంగా లేదా క్షారగుణ తీవ్రత అధికంగా ఉన్న నీటిని మందు ద్రావణం తయారు చేయడానికి ఉపయోగించ రాదు. దీని వలన రసాయన ప్రతికూల మార్పులు ఏర్పడతాయి.
2. సెలినిటీ లేక సాల్ట్ కంటెంట్
(లవణ పరిమాణ సూచిక)
అన్ని రకాల నీటిలోను కొన్ని లవణాలు కరిగి ఉంటాయి. కొన్నింటిలో ఎక్కువగానూ కొన్నింటిలో తక్కువగాను ఉండవచ్చు. లవణాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచి నీరుగా భావించాలి. లవణాలు అధికంగా ఉన్న నీరు మందు ద్రావణంలో కలపడానికి పనికిరావు.
3. నీటి కాఠిన్యత :
నీటిలో ఉండే లవణాల స్వభావాన్ని బట్టి పరస్పర అధిక్యతను బట్టి నీటిని రెండు రకాలుగా విభజించవచ్చు.
సాఫ్ట్ వాటర్(మృదుజలం): సబ్బుతో సులభంగా నురగ వస్తుంది. దీంతో ఏ సమస్య ఉండదు. మందు ద్రావణ తయారీకి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
హార్డ్ వాటర్ (కఠిన జలం): ఇందులో బై కార్పోనేట్స్, క్లోరైడ్స్, సల్ఫేట్లకు సంబంధించిన కా ల్షియం, మెగ్నీషియం లవణాలు అధికంగా ఉంటా యి. ఈ నీటిలో సబ్బు వినియోగించనప్పుడు నుర గ రాదు. నీరు విరిగిపోయినట్లు కనిపిస్తుంది. నుర గ బాగా రావడానికి అధిక పరిమాణంలో సబ్బు వా డాల్సి వస్తుంది. ఈ నీటిని మందు ద్రావణ తయారీకి వాడినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. రసాయన ప్రతికూల చర్య జరగడం వలన ద్రావణం విరిగిపోవడం గమనించవచ్చు. దీని వల్ల మందు క్రిమి సంహారక గుణం క్షీణిస్తోంది.
పాడి–పంట

ద్రావణ తయారీలో నాణ్యత తప్పనిసరి