
బారీకేడ్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం
మరికల్: హోటల్ పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో బైక్‌పై ఇంటికి వస్తుండగా బారీకేడ్‌ను ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన అర్ధరాత్రి మరికల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన కురుమూర్తి(29) మూడు నెలల క్రితం మరికల్‌లోని రాయచూర్ రోడ్డు పక్కన నాటుకోడి హోటల్ పెట్టి జీవనం కొనసాగిస్తున్నాడు. దసరా పండుగ కావడంతో రాత్రి వరకు హోటల్ నడిపించాడు. హోటల్ పనులు ముగించుకొని బైక్‌పై మాధవరం వస్తున్నాడు. సబ్‌స్టేషన్ చౌరస్తాలో ప్రమాదాలను నివారించేందుకు పెట్టిన బారికేడ్‌ను వేగంగా వచ్చి ఢీకొనడంతో కిందపడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన యువతితో 5ఏళ్ల క్రితం వివాహం జరగా.. ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని ఎస్‌ఐ రాము తెలిపారు.
చేపల వేటకు వెళ్లి
వ్యక్తి మృతి
అడ్డాకుల: మండలంలోని శాఖాపూర్‌కు చెందిన వ్యక్తి పండుగ పూట చేపల వేట కు వెళ్లి మృత్యువాతపడ్డా డు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఆకుల చెన్నయ్య (35), ఈదమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చెన్నయ్య గ్రామంలోనే కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా శుక్రవారం ఉదయం చేపల వేటకు గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నమైనా చెన్నయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్ద వెతకగా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం చెరువులో చెన్నయ్య మృతదేహం తేలడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బాధిత కుటుంబ సభ్యు లు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చెన్నయ్య ఫిట్స్‌తో ఇబ్బంది పడేవాడని చెరువులోకి దిగిన తర్వాత ఫిట్స్ రావడంతో నీళ్లల్లో మునిగి చనిపోయి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు.
ఫాంపాండ్‌లో
పడి బాలుడు మృతి
అచ్చంపేట రూరల్: ప్రమాదవశాత్తు పొలంలోని ఫాంఫండ్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని దర్గాతండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. దర్గాతండాకు చెందిన అరుణ కు మారుడు నిహాల్(5)ను తీసుకొని పొలం వద్ద కు వెళ్లింది. పొలం పనుల్లో ఉండగా నిహాల్ ఆ డుకుంటూ పక్కనే ఉన్న ఫాంఫండ్ వద్దకు వెళ్లి కాలుజారి నీటిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతిపై ఎలాంటి కేసు నమో దు కాలేదని అచ్చంపేట పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
కొల్లాపూర్: విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందిన ఘటన పట్టణంలోని వరిదేల హనుమాన్ ఆల య సమీపంలో శనివా రం చోటుచేసుకుంది. స్థాని కుల వివరాల ప్రకా రం గ్రామానికి చెందిన సంగనమోని సత్తయ్య(58) ఇంటి వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యాదాఘాతానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి కుటుంబాన్ని పలువురు నాయకులు పరామర్శించారు.
షార్ట్ సర్క్యూట్‌తో
గుడిసె దగ్ధం
పాన్‌గల్: మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన గడమాల కుర్మయ్యకు చెందిన గుడిసె శనివారం షార్ట్ సర్క్యూట్‌కు గురై దగ్ధమైంది. గుడిసెలో గ్యాస్ సిలిండర్ ఉందని ఇంటి య జ మాని చెప్పడంతో చుట్టు పక్కల నివాస గృహాల వారు సిలిండర్ ఎక్కడ పేలుతుందోనని భయాందోళనకు గురయ్యారు. వెంటనే జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పైర్ ఇంజిన్ సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పె ను ప్రమాదం తప్పింది. ఫైర్ ఇంజిన్ వచ్చే లో పు గ్రామస్తులు, యువకులు మంటలు చుట్టు పక్కల వ్యాపించకుండా నీళ్లు చల్లుతూ కొంతమేర అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఇంటి నిర్మాణం కోసం దాచిన రూ.లక్ష నగ దు, రెండు క్వింటాళ్ల బియ్యం, దుస్తులు, వంట సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. దాదాపుగా రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వమే తనన ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

బారీకేడ్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం

బారీకేడ్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం

బారీకేడ్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం