
ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన
● జిల్లాలో మొదటిరోజు
3,893 మందికి పరీక్షలు
పాలమూరు: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. జిల్లాలో మొదటి రోజు జిల్లాలో 3,893 మంది మహిళలు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా బాలానగర్ పీహెచ్‌సీలో మెగా శిబిరం ఏర్పాటు చేసి 537 మందికి ఏడు రకాల పరీక్షలు చేశారు. ఎంపీ డీకే అరుణ హాజరై ప్రారంభించారు. దీంతోపాటు దేవరకద్రలో ఈఎన్‌టీ పరీక్షలు 103, ఎదిరలో గైనిక్, క్యాన్సర్ పరీక్షలు 109, కోత్లాబాద్‌లో పిడియాట్రిక్ సమస్యలపై 134, గంగాపూర్‌లో జనరల్ మెడిసిన్ విభాగంలో 100 మందికి, అడ్డాకుల పీహెచ్‌సీలో అర్థో సమస్యలపై 117, గండేడ్‌లో 130 మందికి పరీక్షలు నిర్వహించారు. పల్లె దవాఖానాల్లో సైతం మహిళలకు పరీక్షలు చేయడం జరిగింది. గురువారం రాజాపూర్, జానంపేట, పేరూరు, మణికొండ పీహెచ్‌సీలతోపాటు జిల్లాకేంద్రంలోని కుమ్మరివాడి అర్బన్ హెల్త్‌సెంటర్, యూపీహెచ్‌సీ జడ్చర్ల, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోయిలకొండలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేయనున్నారు.