
లోక్ అదాలత్‌లో 2,597 కేసులు రాజీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా కోర్టులో ఈనెల 13న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖకు సంబంధించి 2,597 కేసులు పరిష్కరించినట్లు ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఐపీసీ కేసులు 252 ఉంటే డ్రంకన్‌డ్రైవ్, ఎంవీఐ యాక్ట్ కేసులు కలిపి 564, ఈ–పెట్టీ కేసులు 1,491, కాంప్రమైజ్ కేసులు 193, సైబర్ క్రైం 97 కేసుల్లో బాధితులకు వారి ఖాతాల్లో రూ.32,19,769 నగదు రీఫండ్ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌శాఖ 15 రోజుల నుంచి కోర్టు సిబ్బంది కక్షిదారులను స్వయంగా కలిసి రాజీమార్గంపై అవగాహన కలిగించి లోక్ అదాలత్‌కు హాజరయ్యేవిధంగా చేశారని తెలిపారు.
2న బతుకమ్మ సంబరాలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సత్తూర్ చంద్రకుమార్‌గౌడ్, కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. ఆదివారం స్థానిక రాంనగర్‌లోని ఆర్యసమాజ్ భవనంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దసరా పండుగను కుటుంబ సమేతంగా హిందువులందరూ జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్‌కుమార్‌గౌడ్, కమిటీ గౌరవాధ్యక్షుడు చంద్రయ్య, సభ్యులు డా.మురళీధర్‌రావు, నాగేశ్వర్‌రెడ్డి, బురుజు సుధాకర్‌రెడ్డి, ఎ.అంజయ్య, గోపాల్‌యాదవ్, మాలాద్రి, కె.లక్ష్మణ్, రాంచంద్రయ్య, మోహన్‌యాదవ్, సురేందర్‌రెడ్డి, రమేష్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఉత్సాహంగా నెట్‌బాల్ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో ఆదివారం జూనియర్, సీనియర్ విభాగాల జిల్లా స్థాయి బాలబాలికల నెట్‌బాల్ ఎంపికల ట్రయల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లకు సంబంధించి జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. జూనియర్ విభాగంలో 48, సీనియర్ విభాగంలో 40 మంది హాజరైనట్లు తెలిపారు. కోచ్ సయ్యద్ అంజద్‌అలీ, సీనియర్ క్రీడాకారుడు అబ్దుల్ షరీఫ్ పాల్గొన్నారు.