
దిగువ జూరాలలో సోలార్ కేంద్రం
ఆత్మకూర్: రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద అవకాశం ఉన్నచోట సోలార్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని టీఎస్ జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. హరీశ్ తెలిపారు. గురువారం జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలను సందర్శించారు. దిగువ జూరాల వద్ద 100 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని.. 20 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అలాగే కొత్తగూడెంలో కూడా సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది దిగువ జూరాలలో రికార్డుస్థాయిలో విద్యుదుత్పత్తి చేపట్టి లక్ష్యాన్ని అధిగమించడం అభినందనీయమన్నారు. ఎగువన కూడా లక్ష్యానికి చేరువలో ఉన్నారని చెప్పారు. బదిలీలు చేపట్టాలని, ఖాళీలను భర్తీ చేయాలని ఉద్యోగులు సీఎండీని అభ్యర్థించగా త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట డైరెక్టర్ బాలరాజు, ఎస్‌ఈలు శ్రీధర్, సురేష్, సిబ్బంది ఉన్నారు.
జెన్‌కో సీఎండీ డా. హరీశ్