
జగదీశ్వర్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం
● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
● ఆయనది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం: మంత్రి వాకిటి శ్రీహరి
● పాలమూరులో మాజీ ఎమ్మెల్సీ
జగదీశ్వర్‌రెడ్డి విగ్రహావిష్కరణ
స్టేషన్ మహబూబ్‌నగర్: మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పదేళ్లపాటు సుదీర్ఘకాలంగా పని చేశారని, పార్టీ యంత్రాంగాన్ని నడపాలంటే ఆయన్ను చూసి నేర్చుకోవాలని, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్ పద్మావతీకాలనీలోని గ్రీన్‌బెల్టులో గురువారం మాజీ ఎమ్మెల్సీ ఎస్.జగదీశ్వర్‌రెడ్డి విగ్రహావిష్కరణలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ పార్టీ పరమైన అంశాల్లో, ఇతర సమస్యల్లో ఎవరి మనసు నొప్పించక ప్రజాస్వామికబద్దంగా వ్యవహరించేవారని అన్నారు. ఆనాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో జిల్లా నుంచి ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జగదీశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారని అన్నారు. రాజకీయాలకు సరైన వ్యక్తిగా ఆయన జీవన ప్రయాణం కొనసాగిందన్నారు. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయననే చూసే నేర్చుకోవడం జరిగిందన్నారు. ఎంపీ డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ జగదీశ్వర్‌రెడ్డి ఆదర్శప్రాయుడని, కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని అన్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ జగదీశ్వర్‌రెడ్డితో తనకు ఎంతో ఆత్మీయత అనుబంధం ఉందన్నారు. మొదట్లో నాకు రాజకీయాలు వద్దని చెప్పారని, తర్వాత నాకున్న ఆసక్తితో రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహించారని గుర్తుచేశారు. మాజీ ఎంపీ వి.హనుమంతురావు మాట్లాడుతూ జగదీశ్వర్‌రెడ్డి నిరుపేదలకు సహాయం చేయడంలో ముందుండేవారని అన్నారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, యశస్వినిరెడ్డి, కార్పొరేషన్‌ల చైర్మన్లు గురునాథ్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, కోదండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భానుప్రకాశ్, యాదవరెడ్డి తదితరులు జగదీశ్వర్‌రెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ నందిని, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సంజీవ్ ముదిరాజ్, వినోద్‌కుమార్, ఎన్‌పీ. వెంకటేశ్, చంద్రకుమార్‌గౌడ్, భగవంతురావు, సీజే బెనహర్, ప్రశాంత్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, జహీర్ అఖ్తర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.