
ఉత్సాహంగా కొనసాగుతున్న పోటీలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి టీచర్స్ డేను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఆటల పోటీలు రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. సింధటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలను వీసీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పని ఒత్తిడి తగ్గించుకునేందుకు తప్పకుండా ఆటల్లో పాల్గొనాలన్నారు. ముఖ్యంగా మహిళా సిబ్బంది అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విజేతల వివరాలను పీయూ పీడీ శ్రీనివాస్ వెళ్లడించారు. పురుషుల విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో ఈశ్వర్, విజయ్, కరుణాకర్‌రెడ్డి, షార్టపుట్ విభాగంలో శ్రీనివాస్, సాయికిరణ్, రాఘవేందర్, కరుణాకర్‌రెడ్డి, గాలెన్న, అర్జున్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు, వీసీ శ్రీనివాస్, క్యారమ్స్‌లో రాజశేఖర్, శ్రీశైలం, రెండో బహుమతి విజయభాస్కర్, ఈశ్వర్‌కుమార్ గెలుపొందారు. టెన్నికాయిట్ మహిళా విభాగంలో మొదటి బహుమతి స్వాతి, శ్రీలత, రెండో బహుమతి రజిని, మధులిక, 100 మీటర్ల మహిళా విభాగంలో సంధ్యా, రామంజమ్మ, రజిని, చిన్నదేవి, అరుంధతి, పుష్పలత, షార్ట్‌పుట్ మహిళా విభాగంలో రామాంజమ్మ, స్రవంతి, రజిని, చిన్నాదేవి, మధులిక, శ్రీలత తదితరులు విజేతలుగా నిలిచారు.