
చిన్నారికి తప్పిన ప్రమాదం
● కారులోపల నాలుగేళ్ల చిన్నారి ● ఆటోమెటిక్‌గా
లాకయిన కారు ● అద్దాలు పగులగొట్టి డోర్లు ఓపెన్
జడ్చర్ల టౌన్: కారు ఆటోమేటిక్‌గా డోర్లు మూసుకుపోయిన నేపథ్యంలో నాలుగేళ్ల చిన్నారి ప్రమాదం నుంచి తప్పించుకొన్న ఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రవితేజ భార్య, కుమారుడు తన్విక్‌రెడ్డితో కలిసి షాపింగ్‌కు ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణానికి కారులో వచ్చారు. పిల్లాడిని కారులోనే విడిచి ఇంజిన్ రన్నింగ్‌లో ఉంచి భార్యతో కలిసి దుకాణంలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత కారు డోర్లు ఆటోమెటిక్‌గా లాక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్లాడు కారు అద్దాన్ని కొడుతుండటంతో స్థానికులు గమనించి కారు తలుపు తీసేందుకు యత్నించారు. కారు లోపల నుంచి లాక్ కావడంతో చుట్టుపక్కల ఆరా తీశారు. విషయం తెలుసుకొన్న రవితేజ కారు వద్దకు చేరుకొని ఆటోమెటిక్ లాక్ కావటం గమనించారు. అనంతరం కారు అద్దం పగులగొట్టి పిల్లాడిని బయటకు తీశారు. దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

చిన్నారికి తప్పిన ప్రమాదం