
పీయూలో హెచ్‌ఓడీల నియామకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పలు డిపార్ట్‌మెంట్లకు సంబంధించి హెచ్‌ఓడీలను నియమిస్తూ మంగళవారం వీసీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కెమిస్ట్రీ హెచ్‌ఓడీగా విజయలక్ష్మి, ఫిజిక్స్ హెచ్‌ఓడీగా అంకం భాస్కర్, పొలిటికల్ సైన్స్ హెచ్‌ఓడీగా కుమారస్వామి, ఇంగ్లిష్ హెచ్‌ఓడీగా మాలవి, మైక్రో బయోలజీ హెచ్‌ఓడీగా మధుసూదన్‌రెడ్డిని ఫాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్‌గా ఓయూ అధ్యాపకుడు ఎం.రాములును, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ డీన్‌గా కృష్ణచైతన్య, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్‌గా రామకృష్ణను నియమించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు.