మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ (అండర్–13 )బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బ్రోచర్లను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ 4వ తేదీన క్యాలిఫైయింగ్ మ్యాచ్‌లు, 5 నుంచి మెయిన్‌డ్రా పోటీలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్, ఎల్.రవికుమార్, సంయుక్త కార్యదర్శులు నాగరాజుగౌడ్, ఉదయ్, భాను ప్రకాశ్, సభ్యులు సతీష్ పాల్గొన్నారు.