
అమృత్ భారత్ స్కీం పనుల్లో వేగం పెంచాలి
గద్వాల న్యూటౌన్/స్టేషన్ మహబూబ్‌నగర్/అలంంపూర్: మహబూబ్‌నగర్, గద్వాల రైల్వేస్టేషన్‌లో అమృత్ భారత్ స్కీం కింద చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ సంతోష్‌కుమార్ సూచించారు. మంగళవారం ఆయన గద్వాల రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ప్రత్యేక రైలులో వచ్చిన డీఆర్‌ఎం వస్తూనే రైల్వేట్రాక్‌ను చూసి, పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అధికారులతో కలిసి స్టేషన్, ప్లాట్ ఫాం విస్తీర్ణం, ఆర్చి, వెహికిల్ పార్కింగ్, రోడ్ల పనులను పరిశీలించారు. ఆవరణలో మొక్కలు నాటారు. క్రూలాబీ (ట్రైన్ మేనేజర్ల రెస్ట్‌రూం) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ భారత్ స్కీం కింద చేపడుతున్న పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన నూతనంగా నిర్మించిన రైల్వే ఆఫీసర్ల రెస్ట్ హౌస్‌ను ప్రారంభించారు. డీఆర్‌ఎం వెంట రైల్వే డివిజనల్ ఇంజినీర్ అరుణ్‌కుమార్ శర్మ, డివిజనల్ ఎలక్ట్రిక్ ఇంజినీర్ కిరణ్‌కుమార్, డివిజనల్ సిగ్నల్ టెలికాం ఇంజినీర్ సృజన్‌కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ సురేష్‌కుమార్ ఉన్నారు.
జోగుళాంబ రైల్వే హాల్ట్ పరిశీలన
జోగుళాంబ రైల్వే హాల్ట్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్‌ఎం సంతోష్‌కుమార్ శర్మ పరిశీలించారు. రైల్వే స్టేషన్‌లో విశ్రాంతి, స్టేషన్ గదులను, హై లెవల్ ప్లాట్‌ఫాం, షెడ్డు పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జోగుళాంబ అమ్మవారి దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డీఆర్‌ఎం సంతోష్‌కుమార్ వర్మ