
ఎక్కడెక్కడ అంటే..!
● తెలంగాణచౌరస్తా నుంచి బోయపల్లి గేట్ వరకు మధ్యలో రెండు మూడు చోట్ల రోడ్డుకు అడ్డంగా పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. సద్దలగుండు చౌరస్తా నుంచి స్టేషన్ రోడ్డు (ఎల్‌ఐసీ ఆఫీసు) వరకు బీటీ పూర్తిగా దెబ్బతింది.
● ఎన్‌హెచ్–167 మార్గంలో అప్పన్నపల్లి ఫ్‌లై ఓవర్ బ్రిడ్జిపై రెండు, మూడు చోట్ల బీటీ లేచిపోయింది. అలాగే టీడీగుట్ట రైల్వే గేట్ నుంచి కోయిల్‌కొండ ఎక్స్ రోడ్డ్డు వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఇదేమార్గంలో జెడ్పీహెచ్‌ఎస్ వద్ద రోడ్డు పక్క నుంచి వెళ్లాల్సి వస్తోంది. దీంతో బైక్‌లు మొదలుకుని భారీ వాహనాలు ఆపి.. నెమ్మదిగా పయనించాల్సిందే.
● జీజీహెచ్‌కు ఎదురుగా రెండు వీధుల్లో రోడ్లపై అడుగడుగునా గుంతలు పడ్డాయి.