
ఒక్కో పోగేసి.. మెచ్చే చీర నేసి
రాష్ట్రస్థాయి పురస్కారానికి ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు చేనేత కార్మికులు
●
ఒక్కో పోగు జత చేసి.. కళాత్మకతతో వస్త్రంగా మార్చే నేతన్న కష్టం అసామాన్యం. ఆ శ్రమ వెనుక ఎన్నో ఒడిదొడుకులు దాగి ఉన్నాయి. దశాబ్దాలుగా వస్త్రాలపై వివిధ కళాకృతులను తీర్చిదిద్దుతూ ఔరా అనిపిస్తున్నారు. ఈ క్రమంలో వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత, జౌళి శాఖ అధ్వర్యంలో అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆరుగురు కార్మికులు రాష్ట్ర పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో వనపర్తి జిల్లా నుంచి నలుగురు, గద్వాల జిల్లా నుంచి ఇద్దరు చేనేత కార్మికులు ఉన్నారు. వీరికి ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా పురస్కారాన్ని అందించనున్నారు. రూ.25 వేల నగదు, శాలువాతో సన్మానించి ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు.
ఆనందంగా ఉంది
కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. 60 ఏళ్లుగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నా. చీరలు నేస్తూ వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించా. ఇప్పటికీ కుమారులపై ఆధారపడకుండా మగ్గంపై చీరలు నేస్తున్నా. ఇనాళ్లకు నా ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది.
– దేవరకొండ లచ్చన్న,
చేనేత కార్మికుడు, అమరచింత
ఎన్నో ఒడిదుడుకులు
ఎదుర్కొన్నా..
35 ఏళ్లుగా మగ్గంపై పట్టు చీరలు తయారు నేస్తున్నా. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఆర్థికభారాన్ని తట్టుకుంటూ వచ్చే కొంత డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. వృత్తిలో నైపుణ్య పెంచుకుంటూ డిజైన్ల జరీ చీరలను తయారు చేస్తున్నాను. అవార్డుకు ఎంపిక అయ్యావని జౌళి శాఖ అధికారులు తెలిపారు. గర్వంగా ఉంది.
– మహాంకాళి సులోచన,
చేనేత కార్మికురాలు, అమరచింత
– గద్వాల టౌన్/అమరచింత
కళాత్మకతను రంగరించే గద్వాల చీర
చిత్రంలో కనిపిస్తున్న చేనేత కార్మికుడి పేరు సూర్య వెంకటేష్. ఈయన స్వస్థలం జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోళి. 40 ఏళ్ల నుంచి చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవ పురస్కారాల నేపథ్యంలో 70 ఏళ్ల క్రితం నాటి విభిన్నమైన డిజైన్‌తో కూడిన అసలైన గద్వాల కాటన్ చీరను నేసి పోటీకి పంపారు. మీనాకారి బార్డర్, కుట్ట టెక్నిక్‌తో మగ్గం నేశారు. ప్రత్యేకమైన కొంగుతో చీరను తీర్చిదిద్డారు. కొంగును ప్రత్యేకంగా అతికించి, జాకార్డు సాయంతో నాలుగు వేల పోగులతో చీరను నేశారు. అయిదు ఇండ్ల రేషం, అయిదు ఇండ్ల కాటన్ మధ్యలో జరీకడ్డి ఉపయోగించి చెక్స్ డిజైన్ ఉండే విధంగా చీరను నేసి పురస్కారానికి ఎంపికయ్యారు.
ప్రతిభ గుర్తించారు..
నాతోపాటు మా కుటుంబసభ్యులు చేనేత వృత్తినే నమ్ముకున్నాం. 45 ఏళ్లుగా జరీ చీరలను తయారు చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రస్తుత కాలంలో కంప్యూటర్ డిజైన్‌లు రావడంతోపాటు కొత్త కొత్త డిజైన్లలో చీరల తయారు చేస్తున్నాం. వీటిని అదిగమించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. చేతి పనిపై పట్టు సాధించి డిజైన్లలో మార్పులు తీసుకొస్తు చీరలను తయారు చేస్తున్నాను. అవార్డు రావడం ఆనందంగా ఉంది.
– సారంగి రాములు, చేనేత కార్మికుడు, కోత్తకోట
వృత్తికి గౌరవం దక్కింది
40 సంవత్సరాలుగా చేనేత వృత్తిపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. చేనేత వృత్తి సన్నగిల్లినా.. చీరలకు ఆశించిన ధరలు రాకపోయినా జరీ చీరల తయారీపైనే ఆధారపడ్డా. చేతి పనితోనే జరీచీరను 40 గుండీలతో తయారు చేస్తున్నాను. ఒక్క చీర తయారీకి 15 రోజుల సమయం పడుతుంది. వృత్తిపై గౌరవం ఉండి ఇన్నేళ్లుగా చేనేతపై ఆధారపడిన తనలాంటి వాళ్లకు అవార్డు దక్కడం సంతోషంగా ఉంది.
– శీల బుడ్డన్న, చేనేత కార్మికుడు, తిపుడంపల్లి
●
నైపుణ్యంతోనే
గుర్తింపు..

ఒక్కో పోగేసి.. మెచ్చే చీర నేసి

ఒక్కో పోగేసి.. మెచ్చే చీర నేసి

ఒక్కో పోగేసి.. మెచ్చే చీర నేసి

ఒక్కో పోగేసి.. మెచ్చే చీర నేసి

ఒక్కో పోగేసి.. మెచ్చే చీర నేసి

ఒక్కో పోగేసి.. మెచ్చే చీర నేసి

ఒక్కో పోగేసి.. మెచ్చే చీర నేసి