ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఐదునెలలు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఐదునెలలు

Jul 26 2025 9:06 AM | Updated on Jul 26 2025 9:06 AM

ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఐదునెలలు

ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఐదునెలలు

అత్యంత సాంకేతిక

పరిజ్ఞానంతో..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం తవ్వకం పనులు పునరుద్ధరణకు చ ర్యలు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే వెల్లడించా రు. జాతీయ భౌగోళిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ), జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ)సహకారంతో మిగిలిన 9.559 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు సత్వరమే పూర్తి చేసేదిశగా అడుగులు వేస్తున్నారు. సొరంగం ప్రాంతంలోని నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్లతో ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ సర్వే చేయించాలని ప్రభు త్వం నిర్ణయించింది. అందుకు తక్కువ ఎత్తు లో ఎగిరే సామర్థ్యం గల రక్షణ శాఖకు చెంది న రెండు హెలికాప్టర్లు వినియోగించునున్నా రు. సర్వే పరికరాలను డెన్మార్స్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించనున్నారు. ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ పరికరాలతో జరిపే సర్వే భూ ఉపరితలం నుంచి కిలోమీటర్‌ లోతు వరకు నేల స్వభావంతోపాటు ఇతర సమాచారాన్ని అందిస్తోంది. పనుల్లో ఎలాంటి అవాంతరాలు రాకుండా ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తల సహకారంతో ఏరియల్‌ లైడార్‌ సర్వేను చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సొరంగం నిర్మాణంలో అనుభవం కలిగిన ఆర్మీ మాజీ ఈఎన్‌సీ హర్పాల్‌ సింగ్‌ను సలహాదారుడిగా, కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రాను స్పెషల్‌ సెక్రటరీ హోదాలో రెండేళ్లపాటు నియమించారు.

గల్లంతైన 8మందిలో నేటికీ లభించని ఆరుగురి ఆచూకి

సొరంగం తవ్వకానికి ప్రభుత్వం సన్నద్ధం

మిగిలిన 9.559 కి.మీ. పనుల పూర్తికి అడుగులు

నేల స్వభావం అంచనాకు ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ సర్వే!

అచ్చంపేట: దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ)ఇన్‌లెట్‌ సొరంగం పైకప్పు కూలిన ఘటనకు నేటితో ఐదునెలలు పూర్తవుతుంది. ఫ్రిబవరి 22న సొరంగం పైకప్పు కూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న 8మంది కార్మికులు చిక్కుకోగా ఇద్దరి మృతదేహాలను మాత్రమే వెలకితీశారు. 66రోజులపాటు కొనసాగిన అన్వేషణలో సొరంగంలో ఇరుక్కుపోయిన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ విడిభాగాలు కత్తిరించి, మట్టి, బండరాళ్లును బయటకు తరలించారు. మిగిలిన ఆరుగురి కోసం విస్తృతంగా గాలించిన వారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. గల్లంతైన కార్మికుల జాడ కోసం చేపట్టిన విస్తృత గాలింపు చర్యల తర్వాత ప్రభుత్వం సహాయక చర్యలను నిలిపివేశారు. నల్గొండ జిల్లాకు 3.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఇన్‌లెట్‌ (దోమలపెంట) శ్రీశైలం జలాశయం నుంచి ఆరంభం అవుతుంది. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి ఔట్‌లెట్‌ వరకు మొత్తం 43.930 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇన్‌లెట్‌ సొరంగం వైపునుంచి 13.930 కిలోమీటరు వద్ద టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) సొరంగం తవ్వుతుండగా పైనుంచి ఉబికి వచ్చిన నీటి ఉధృతికి పైకప్పు కూలడంతో చివరి వరకు వెళ్లిన కార్మికులు అందులో చిక్కుకున్నారు. నీటి ప్రవాహంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడడంతో డీ–1 నిషేఽధిత ప్రాంతం మినహా కాంక్రీట్‌ సెగ్మెంట్లు, బండరాళ్లు, బురద మట్టిని తొలగించినా గల్లంతైన కార్మికుల అచూకీ లభించలేదు.

12సంస్థల సహకారంతో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రెస్క్యూ బృందాలు సొరంగం కుప్పకూలిన నాటి నుంచి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు ఎంతో శ్రమించి రెస్క్యూ ఆఫరేషన్‌ చేశాయి. ఇందులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సింగరేణి మైన్స్‌ రెస్క్యూ, ఆర్మీ, దక్షణ మధ్య రైల్వే, నేవీ, ర్యాట్‌హోల్‌ మైనర్స్‌, హైడ్రా, ఎస్‌ఆర్‌ఎస్‌, జీఎస్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ, రోబోటిక్‌ కంపెనీ వంటి 12సంస్థలకు చెందిన 800మంది కార్మికులు మూడు షిఫ్ట్‌ల్లో 24గంటలు పనిచేశాయి. అత్యాధునిక యంత్రాలు, పరికరాలను ఉపయోగించారు. మానవ శేషాలను గుర్తించేందుకు స్వీపర్‌ డాగ్స్‌, క్యాడవర్‌ డాగ్స్‌ను కేరళ నుంచి రప్పించారు. జేపీ కంపెనీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ట్రాన్స్‌కో, గిరిజన సంక్షేమశాఖలు వివిధ సేవలు అందించాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సొరంగం సందర్శించి పర్యవేక్షించారు.

43మీటర్ల వద్ద నిలిచిన సహాయక చర్యలు

ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి సొరంగం తవ్వకాలను ముందుకు కొనసాగించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) హెచ్చరించిన నేపథ్యంలో 13.930కిలోమీటర్ల వెనక్కి 43మీటర్ల శిథిలాలను తొలగించలేదు. ప్రమాద స్థలంలో శిథిలాలను తొలగించేందుకు సహాయక బృందాలు డీ–1, డీ–2 ప్రదేశాలుగా గుర్తించి శిథిలాలు తొలగించారు. డీ–2, డీ–1 ప్రదేశం వరకు 281 మీటర్ల తవ్వకాలు పూర్తికాగా అత్యంత ప్రమాదకరమైన నిషేధిత ప్రాంతంలో తొలగింపు పనులు నిలిపివేశారు. నిషేధిత ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్లు కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవ కాశం ఉందని అధ్యయన కమిటీ తేల్చింది.

9.55 కిలోమీటర్ల సొరంగం కోసం..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 43.930 కిలోమీటర్ల సొరంగానికి..ఇన్‌లెట్‌ వైపు నుంచి 13.930 కిలోమీటర్లు, ఔట్‌లెట్‌ మన్నెవారిపల్లి వైపు నుంచి మరో 20.430 కిలోమీటర్ల చొప్పున ఇప్పటివరకు 34.710 కిలోమీటర్ల మేర పనులు పూర్తికాగా.. ఇంకా 9.559 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. ఈ సొరంగాన్ని ఇప్పటి వరకు రెండు టీబీఎంల సహాయంతో రెండువైపులా(ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌) నుంచి తవ్వుకుంటూ వచ్చారు. ఇన్‌లెట్‌ వైపు సొరంగం ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఐదునెలలుగా పనులు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement