
అనుమతి లేని కల్లు డిపోపై దాడి
గద్వాల క్రైం: ఎలాంటి అనుమతులు లేకుండా.. గుట్టుగా కొనసాగుతున్న కల్లు డిపోపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం మెరుపుదాడి చేసింది. దాదాపు 468 లీటర్ల కల్లు, 100 కేజీల చక్కెర, 10 కేజీల ఈస్ట్ (కల్లు తెలుపు రంగు కోసం వాడే పదార్ధం) రెండు బైక్‌లు స్వాధీనం చేసుకోవడంతోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎకై ్సజ్ అధికారి విజయభాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గోనుపాడు గ్రామ శివారులోని శెట్టి ఆత్మకూర్ రోడ్డు మార్గంలో ఎకై ్సజ్ శాఖ అనుమతి లేకుండా కల్లు డిపోను కొనసాగిస్తున్నారు. ఈ డిపోను గుండ్రాతి సాంబశివగౌడ్, లక్నిసాని కిషోర్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్ నడుపుతూ.. తయారు చేసిన కల్లును మోటార్ సైకిళ్లపై చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయాలు చేస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు గురువారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం కల్లుడిపోపై దాడి చేశారు. అయితే దాడులు చేపట్టిన క్రమంలో కల్లు తయారీకి వినియోగించిన చక్కెర, ఈస్ట్ పదార్థం, కల్లు, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తయారు చేసిన కల్లును సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. క్లోరో హైడ్రేడ్ (సీహెచ్), డైజోఫాం, ఆల్ఫోజోలం వంటి మత్తు పదార్థాలతో కల్లును తయారీ చేశారా లేదా అనే విషయాలను ల్యాబ్‌కు పంపించిన శాంపిల్స్ ఫలితాల ఆధారంగా గుర్తించనున్నారు. పట్టుబడిన ముగ్గురు నిందితులపై ఎకై ్సజ్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేశామని అధికారి తెలిపారు.
గోప్యంగా..
ఎలాంటి అనుమతి లేకుండా గోనుపాడు శివారులో కల్లు డిపోను కొన్ని నెలలుగా నిర్వహిండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం గురువారం రాత్రి దాడి చేసింది. అయితే దాడి చేపట్టిన విషయాన్ని జిల్లా ఎకై ్సజ్ అధికారులు ధ్రువీకరించలేదు. అనంతరం మీడియా వాకబు చేయగా సీఐ గణపతిరెడ్డి అధికారికంగా దాడుల సమాచారంపై ప్రకటన విడుదల చేశారు. ఇదిలాఉండగా, జిల్లా పరిధిలో ఎకై ్సజ్, డీటీఎఫ్ సిబ్బంది నిత్యం తనిఖీలు చేపడుతుండగా వారికి ఈ డిపో విషయం తెలియదా.. లేక రాజకీయ ఒత్తిళ్లు, ఇతరాత్ర నజరానాలు అందడంతో చూసీచూడనట్లు వదిలేశారా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రసాయన పదార్థాలతో తయారుచేసే కల్లుతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా కూడా ఉక్కుపాదం మోపడంలో జిల్లా ఎకై ్సజ్ అధికారులు విఫలమయ్యారని.. దాడి విషయాన్ని గోప్యంగా ఉంచడం ఏమిటని పలువురు గీత కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
468 లీటర్ల కల్లు స్వాధీనం
ముగ్గురి అరెస్టు..
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడితో జిల్లాలో అలజడి