
హిందువుల ఐక్యతే లక్ష్యం
వనపర్తిటౌన్: హిందువులందరినీ ఒకే నినాదం, ఒకే విధానంలోకి తీసుకురావాలని, అందుకోసం హిందూవాహిని పని చేస్తుందని హిందూవాహిని ద్విరాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో హిందూ ప్రముఖులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరు కులాలను పక్కనబెట్టి మనమంతా ఒక్కటే అనే భావనను చాటిచెప్పే సమయం ఆసన్నమైందని.. వంశపారంపర్యంగా వస్తున్న కులవృత్తిని గౌరవిస్తూ పర మతాలకు అవకాశం ఇవ్వకుండా మనకంటూ స్థ్ధానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తీయడానికే కొన్ని శత్రు దేశాలు పన్నిన కుట్రలో భాగంగా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ప్రేమ, బెస్టీ అనే కొత్త కొత్త సంబంధాలతో ట్రాప్ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి యుద్ధాలు, ఆటంకాలు వచ్చినా ఏకమై ఎదుర్కొనేలా ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హిందూవాహిని రాష్ట్ర ఆర్గనైజర్ ముడుపు యాదిరెడ్డి, రాష్ట్ర సహ సంయోజక్ హరిచంద్రారెడ్డి, విభాగ్ కన్వీనర్ అభిలాష్, జిల్లా కన్వీనర్ అరుణ్‌గౌడ్, కో–కన్వీనర్లు శ్రీకాంత్, నవీన్, పట్టణ కన్వీనర్ నంద, నాయకులు మూర్తి, సంతోష్, నీలేష్, కార్తీక్, భరత్, సంతోష్, నిఖిల్‌సాయి, హిందూవాహిని కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.