
కొల్లాపూర్ రేంజ్‌లో 5 పెద్దపులులు
కొల్లాపూర్: కొల్లాపూర్ అటవీ రేంజ్ పరిధిలో 5 పెద్దపులులతోపాటు 2 చిన్నపిల్లలు ఉన్నట్లు రేంజర్ ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం అంకిల్‌పెంట ఏరియాలో నాలుగు పెద్దపులుల జాడలు గుర్తించామని వెల్లడించారు. వాటి జాడలు గుర్తించిన సిబ్బందిని డీఎఫ్‌ఓ రోహిత్ గోపిడి, ఎఫ్‌డీఓ చంద్రశేఖర్ అభినందించారని తెలిపారు. సీసీ కెమెరాల్లో కూడా వాటి కదలికలు నమోదయ్యాయని వివరించారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పులుల సంతానోత్పత్తి సమయమన్నారు. ఈ సమయంలో అడవిలోకి మనుషులు వెళ్లడం ప్రమాదకరమన్నారు. మనుషుల అలికిడి గమనిస్తే పులులు వారిపై దాడులు చేసే ఆస్కారం ఉంటుందన్నారు. వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. పులుల జాడలు గుర్తించే కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్లు ముజీబ్‌ఘోరీ, శివ, నీలేశ్, కిరణ్, నాగార్జునగౌడ్, శ్యామ్, నవీన్, లిఖిత తదితరులున్నారు.
పులుల జాడలు గుర్తించిన అటవీ అధికారులు

కొల్లాపూర్ రేంజ్‌లో 5 పెద్దపులులు