
స్వలాభం కోసమే కాంగ్రెస్‌లోకి..
జడ్చర్ల: స్వలాభం కోసమే మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, కౌన్సిలర్ ఉమాదేవి కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ను వీడడం వలన శని వదిలిందంటూ స్థానిక గాంధీచౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నమ్మకంతో టికెట్ ఇచ్చి పదవులు కల్పిస్తే సొంత ప్రయోజనాలకు అమ్ముడుపోయారని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. పదవుల కోసం పాకులాడుతున్నారని దుయ్యబట్టారు. చేతనైతే రాజీనామా చేసి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీలో నిలబడి గెలవాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌యాదవ్, అంజిబాబు, మసియొద్దీన్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.