
ఆకట్టుకున్న ‘ఫుడ్ ఫెస్టివల్’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. సుమారు 50 స్టాళ్లలో ఆయా మహిళా సంఘాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించారు. స్టాళ్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో పాటు కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ తదితరులు సందర్శించారు. ముఖ్యంగా మిల్లెట్ మాల్ట్, వివిధ రకాల తినుబండారాలు, వస్త్ర, జ్యూట్ ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపి, కొనుగోలు చేశారు.
శిల్పారామంలో సుమారు 50 స్టాళ్లలో ప్రదర్శనలు
ఎమ్మెల్యే యెన్నంతో పాటు ఉన్నతాధికారుల సందర్శన