
అకాడమీలో క్రీడాకారుల ప్రవేశాలు
వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం 2022 డిసెంబర్ 1న రాష్ట్రంలోని బాల, బాలికలకు ఎంపికలు నిర్వహించినా అప్పట్లో క్రీడాకారుల ప్రవేశాలు మాత్రం కల్పించలేదు. మళ్లీ జూన్ 12న వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరయ్యారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో ఎంపికై న క్రీడాకారుల వివరాలను సోమవారం జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ప్రకటించారు. క్రీడాకారులు మంగళవారం సాయంత్రం 5 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలని, మిగతా వివరాల కోసం వాలీబాల్ కోచ్ పర్వేజ్‌పాష 77805 82604 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.