
నీటిని పంపింగ్ చేస్తున్నాం..
నెట్టెంపాడు ఎత్తిపోతల స్టేజీ–1, 2లలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. వీటిలో ఒకసారి మాత్రమే 6 పంపులతో నీటిని పంపింగ్ చేశాం. మోటార్లలో ఎలాంటి సమస్య లేదు. అయితే పంపుహౌస్‌లో గ్రిడ్‌ను రన్ చేసేందుకు ఎస్‌ఎఫ్‌సీ రన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి రిపేరు వస్తే సరిచేశాం. ప్రస్తు తం రెండు పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నాం. దీనిపై బీహెచ్‌ఈఎల్ వారికి తెలియజేశాం. అయితే ఇతర ప్రాజెక్టులలో వారికి రావాల్సిన బిల్లులు బకాయిలు ఉండడంతో రిపేరు చేసేందుకు రావడం లేదు. ఇప్పటి వరకై తే రూ.2 కోట్ల బకాయిలు చెల్లించాం.
– రహీముద్దీన్, ఎస్‌ఈ ఇరిగేషన్ శాఖ
●