
డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న సెమిస్టర్– 2, 4, 6కు సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి సెమిస్టర్–2 బీఏలో 31.45 శాతం, బీకాంలో 36.86, బీఎస్సీ 29.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెమిస్టర్–4 బీఏలో 51.36, బీకాంలో 43.57, బీఎస్సీలో 37.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సెమిస్టర్–6 బీఏలో 52.27, బీకాం 54.57, బీఎస్సీ 55.58 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బ్యాక్‌లాగ్ సెమిస్టర్–5 బీఏలో 52.88 శాతం, బీకాంలో 54.44, బీఎస్సీలో 46.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమే ష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, శాంతిప్రియ, అనురాధరెడ్డి, అరుంధతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు –2025 నామినేషన్‌లకు సంబంధించి ఆసక్తి గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బాధితులకు తక్షణ సహాయం అందాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడానికి బాధితులకు తక్షణ సహాయం అందించే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లావ్యాప్తంగా 15 మంది బాధితులు పలు రకాల సమస్యలపై ఎస్పీకి ఫిర్యాదులు అందించారు. సదరు ఫిర్యాదులపై ఎస్పీ పరిశీలించి ఆయా పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ సమస్యలు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. పౌరుల సమస్యలు ప్రాధాన్యతతో వినడం, అందరితో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, వాటి పరిష్కారస్థితిని క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆదేశించారు.
18న సీఎం పర్యటన
పెంట్లవెల్లి: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలో 22 ఎకరాలలో నిర్మించనున్న రెసిడెన్షియల్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగసభ నిర్వహించనున్నారు. కాగా.. సోమవారం నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ హెలీప్యాడ్, సభావేదిక, పార్కింగ్ వంటి స్థలాలను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. సమయం లేనందున అధికారులు క్షేత్రస్థాయిలో దగ్గరుండి మూడు రోజుల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయా లని ఆదేశించారు. అసంపూర్తి పనులు మరింత ముమ్మరం చేయాలని జిల్లాస్థాయి అధికారుల కు సూచించారు. మంగళవారం మంత్రి జూ పల్లి కృష్ణారావు స్థల పరిశీలన చేస్తారని, ఆలో గా పనులు కొలిక్కి వచ్చేలా చూడాలన్నారు. సభావేదిక ఏర్పాట్లు, ఇతర పనుల్లో ఎలాంటి అలసత్యం వహించరాదని చెప్పారు.
కమ్యూనిస్టులతోనే
సమస్యలు పరిష్కారం
ఉండవెల్లి: కమ్యూనిస్టుల పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతున్నాయని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలం కంచుపాడులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో అన్యాయాలు, దోపిడీని అరికట్టేందుకు కమ్యూనిజమే ఏకై క మార్గమన్నారు. కమ్యూనిజానికి మించిన సిద్ధాంతం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ నిరంతరం పోరాడుతుందన్నారు. దేశంలోని 80 శాతం హిందువులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఓట్ల కోసమే హిందువులను ఏకం చేస్తున్నారని విమర్శించారు. పాలకులు మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధానాలను మానుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకురాలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఆశన్న, రంగన్న పాల్గొన్నారు.

డిగ్రీ ఫలితాలు విడుదల