
ప్రతిపాదించారు.. పట్టించుకోరు!
బస్టాండ్ సమీపంలో రద్దీగా ఉన్న
167వ నంబరు జాతీయ రహదారి
2022లో ప్రతిపాదనలు
పాదచారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జాతీయ రహదారుల శాఖ 2022లో మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తిల్లో మొత్తం 8 ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిలో జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ సమీపంలో ఒకటి, కల్వకుర్తి రోడ్డులో డిగ్రీ కళాశాల వద్ద మరోటి నిర్మించాలని మట్టి నమూనాలు సైతం సేకరించారు. ఈ మేరకు అప్పటి ఏఈఈ వినోద్, మున్సిపల్ చైర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమీషనర్ సునీత స్థల పరిశీలన చేసి ఆమోదించారు. కొత్తబస్టాండ్ వద్ద రూ.3.50కోట్లు, డిగ్రీ కళాశాల వద్ద రూ.2కోట్లతో వీటిని నిర్మించాలని ఉన్నప్పటికి ఆ ప్రతిపాదనలు పూర్తిగా అటకెక్కాయి. మూడేళ్లయినా వాటి ఊసేలేకుండా పోయింది. ఇప్పుడున్న జాతీయ రహదారి శాఖ అధికారులు ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌పై పెదవి విరుస్తున్నారు.
బాదేపల్లి పట్టణం సిగ్నల్‌గడ్డ హైస్కూల్ వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు నడుస్తున్నందున అవి పూర్తయ్యాక నిర్మాణం చేయాలని లేదంటే విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1000మందికిపైగా విద్యార్థులున్న హైస్కూల్ సాయంత్రం వేళలో రద్దీ ఏర్పడి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. అటు బస్టాండ్, ఇటు హైస్కూల్ వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి అధికారులు కసరత్తు చేయాల్సి ఉంది.
జడ్చర్ల టౌన్: పెరుగుతున్న వాహన రద్దీ.. రోడ్డు దాటేందుకు పాదాచారుల ఇబ్బందులు.. రోడ్డుప్రమాదాలు నివారించడానికి 167 జాతీయ రహదారిపై ఫుట్‌ఓవర్ వంతెనల నిర్మాణాలు జాతీయ రహదారుల శాఖ ప్రతిపాదించింది. 2022లో జడ్చర్ల మున్సిపాలిటీలో రెండు ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి రూ.5.50కోట్లతో ప్రతిపాదలు సిద్ధం చేసింది. నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
● దినదినాభివృద్ధి చెందుతున్న జడ్చర్ల మున్సిపాలిటీ గుండా 44, 167 రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. అయితే 167వ నెంబరు జాతీయ రహదారి మున్సిపాలిటీ పరిధి ప్రారంభం నక్కలబండతండా నుంచి గంగాపురం శివారు వరకు సుమారు 4కి.మీ మేర పట్టణంలోంచి వెళ్తుంది. దీంతో రోడ్డుపై వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. 167 నెంబరు జాతీయ రహదారి కర్ణాటక రాష్ట్రంలో మొదలై ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చి జడ్చర్ల గుండా నల్గొండ వయా కోదాడ వరకు వెళ్తుంది. మరోవైపు ఇటు కొడంగల్ వైపు కూడా 167 జాతీయ రహదారి మహబూబ్‌నగర్‌కు కలవడంతో ఆ మార్గంలో వచ్చే వాహనాలు కోదాడకు ఇదే రోడ్డుగుండా వెళ్తుంటాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. వీటితోపాటు అటు హైదరాబాద్, ఇటు కర్నూలు, మరోవైపు నాగర్‌కర్నూలు, వనపర్తి నుంచి వచ్చే వాహనాల సంగతి సరేసరి. పోలేపల్లి ఫార్మసెజ్ కారణంగా నిత్యం వేలసంఖ్యలో ఉద్యోగులు ఇదేమార్గాన వెళ్తుంటారు. ఈ కారణంగా 167వ నెంబరు జాతీయ రహదారి రోడ్డు దాటేందుకు పాదాచారులకు ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా హౌజింగ్‌బోర్డు కాలనీ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ అధికంగా నెలకొంటుంది. ఇక పట్టణంలో సిగ్నల్‌గడ్డ వద్ద రద్దీ అధికంగా ఉంటోంది. రోడ్డు దాటాలంటే సమయం పడుతుంది. అంతగా వాహనాల రద్దీ పెరుగుతుంది. రోడ్డుదాటే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
హైస్కూల్ వద్ద
నిర్మించాలన్న డిమాండ్లు
167వ జాతీయ రహదారిపై అటకెక్కిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం
2022మార్చిలో వంతెనల నిర్మాణానికి మట్టినమూనాల సేకరణ
రూ.5.50కోట్లతో రెండు ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌లకు ప్రతిపాదనలు
ఇప్పుడు పెదవి విరుస్తున్న జాతీయ రహదారుల శాఖ

ప్రతిపాదించారు.. పట్టించుకోరు!