
పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు
పాలమూరు: జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో ఆశ్రయంలో పొందుతున్న పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలో ఉన్న బాల సదన్‌ను శుక్రవారం న్యాయమూర్తి ఆకస్మికంగా సందర్శించి పిల్లల ఆరోగ్యంపై ఆరా తీశారు. స్థానికంగా పనిచేసే సిబ్బంది పిల్లల ఆరోగ్యంపై ఏదైనా తేడాలు గమనిస్తే వెంటనే వైద్యులను పిలిపించి చికిత్స అందించేలా చూడాలన్నారు. చిన్నారులు ఆరోగ్యవంతంగా ఉంటేనే వారి భవిష్యత్ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం పలు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, ఆర్‌బీఎస్‌కే వైద్యులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన సూపరింటెండెంట్
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి తాత్కాలిక సూపరింటెండెంట్‌గా అనస్తీషియా హెచ్‌ఓడీ మాధవి శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ బదిలీ తర్వాత ప్రభుత్వం జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఎవరికీ బాధ్యతలు అప్పగించకపోవడంతో తాత్కాలికంగా డాక్టర్ మాధవి సూపరింటెండెంట్‌గా వ్యవహరించనున్నారు.
ఎన్టీఆర్ కళాశాలలో ఉద్యోగ మేళా
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్‌మేళాను మ్యాజిక్ బస్ టెక్ మహేంద్ర, ముతూట్ ఫైనాన్స్, వైసీస్ క్లౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మేళాలో మొత్తం 200 మంది విద్యార్థులు పాల్గొనగా.. 50 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పద్మాఅనురాధ, అమీనా ముంతాజ్, శ్రీదేవి, హరిబాబు, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.
విధులపై నిర్లక్ష్యం వహించొద్దు : డీఈఓ
చిన్నచింతకుంట: ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని డీఈఓ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని లాల్‌కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తర గతి గదులు, మంచినీటి వసతి, ఉపాధ్యాయు ల బోధన, విద్యార్థుల సామర్థ్యం తదితర వా టిని పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యూట్రీన్ గార్డెన్ పరిశీలించి మొక్కలు నాటి.. విద్యార్థులకు అందజేశారు.

పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు