
వృద్ధుడి బలవన్మరణం
కోడేరు: పురుగుమందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘ టన నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ జగదీశ్వర్ కథనం మేరకు.. మండలంలోని మాచుపల్లికి చెందిన గొల్ల పల్లి శేషయ్య (55) కుటుంబ కలహాలతో గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పురుగుమందు తాగాడు. కుటుంబీకులు గుర్తించి వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందా డు. శేషయ్యకు భార్య, కుమారులు ఉన్నారు.
రెండు భైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి
కొత్తకోట రూరల్: రెండు బైక్‌లు ఎదురెరుదుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కొత్తకోట ఎస్‌ఐ ఆనందర్ కథనం ప్రకారం.. మండలంలోని రామనంతాపూర్‌కు చెందిన ఎన్.రాంచంద్రయ్య(55) శుక్రవారం ఉదయం గ్రామసమీపంలోని వ్యవసాయ పొలానికి బైక్‌పై వెళ్తుండగా శంకరమ్మపేటకు చెందిన వ్యక్తి పల్సర్‌పై ఎదురుగా వస్తూ రాంచంద్రయ్య బైక్‌ను బలంగా ఢీకొనడంతో కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా రాంచంద్రయ్యను వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్‌కు రెఫర్ చేశారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
భార్య చూసేందుకు
వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
● భర్త దుర్మరణం
మరికల్: పెళ్లయిన రెండు నెలలకే యువకుడిని మృత్యువు వెంటాడింది. ఆషాఢమాసం కావడంతో భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను చూసేందుకు భర్త ద్విచక్ర వాహనంపై అత్తగారింటికి వెళ్తున్న క్రమంలో కారు ఢీకొట్టడంతో మృతి చెందిన ఘటన గురువారం రాత్రి మరికల్ మండలం తీలేరు సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దేవరకద్ర మండలంలోని నార్లోనికుంట్లకు చెందిన శివకుమార్ (25)కు జక్లేర్ పరిధిలోని కాచ్‌వార్‌కు చెందిన అమ్మాయితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను చూసేందుకు కాచ్‌వార్‌కు వెళ్తుండగా తీలేరు సమీపంలో కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వివాహం అయిన రెండు నెలలకే భర్తను కోల్పోయిన భార్య, చేతికొచ్చిన కొడుకును అకాల మరణం కబళించడంతో తల్లిదండ్రులు వాపోతున్నారు.
వివాహిత బలవన్మరణం
ఆత్మకూర్: మతిస్థిమితం కోల్పోయిన ఓ వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ నరేందర్ కథనం ప్రకారం.. ఆత్మకూర్‌లోని బాలకిష్టమ్మ కాలనీలో నివాసం ఉంటున్న రామేశ్వరమ్మ(36) భర్తతో విడిపోయి కుమారుడితో కలిసి జీవనం సాగిస్తుంది. అయితే గురువారం అర్ధరాత్రి రామేశ్వరమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుమారుడు చుట్టు పక్కలవారికి సమాచారం ఇవ్వడంతో రామేశ్వరమ్మను కిందికి దించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందిందని ధ్రువీకరించారు. ఈ ఘటనపై శుక్రవారం కుమారుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, శవ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మనస్తాపంతో
దివ్యాంగుడి ఆత్మహత్య
కొత్తకోట రూరల్: డబ్బులు ఇవ్వాలంటూ వేధించడంతోపాటు దాడి చేయడంతో మనస్తాపానికి గురైన ఓ దివ్యాంగుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ ఆనంద్ కథనం ప్రకారం.. మండలంలోని విలియంకొండకు చెందిన దివ్యాంగుడు బొల్లి ఆంజనేయులు(35)కు భార్య సరోజతోపాటు ముగ్గురు సంతానం. గ్రామంలో చిన్నపాటి కిరాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. ఆంజనేయులు చిన్నాన్న కుమారుడు బొల్లి వంశీ తాగివచ్చి కిరాణం దగ్గర ఉద్దెరకు సరుకులు, అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురిచేసేవాడు. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి వంశీని మందలించారు. ఈనెల 10న రాత్రి షాపు ద గ్గరకు వచ్చిన వంశీ మరోమారు గొడవ పడి దూషిస్తూ.. దాడి చేశాడు. మనస్తాపానికి గురై న ఆంజనేయులు రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు భార్య సరోజ ఫిర్యాదు మేరకు వంశీపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

వృద్ధుడి బలవన్మరణం

వృద్ధుడి బలవన్మరణం

వృద్ధుడి బలవన్మరణం

వృద్ధుడి బలవన్మరణం