
నిండుగా.. జూరాల
ధరూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద కాస్త పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం 1.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 1.09 లక్షలకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్ట్‌గేట్లు ఎత్తి 67,310 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 30,316 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 460, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 800, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.778 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
నిరంతరాయంగా విద్యుదుత్పత్తి..
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. శుక్రవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 108.948 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 129.466 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు.
సుంకేసులకు కొనసాగుతున్న వరద..
రాజోళి: సుంకేసుల జలాశయానికి శుక్రవారం ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 49,800 క్యూసెక్కుల వరద చేరినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. 13 గేట్లను తెరిచి 51,402 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలం జలాశయానికి వదిలినట్లు పేర్కొన్నారు.
10 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి