
భర్తను కొట్టి చంపిన భార్య
కొత్తకోట రూరల్: తాగొచ్చి వేస్తున్నాడంటూ కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్లలో చోటు చేసుకుంది. కొత్తకోట సీఐ రాంబాబు కథనం మేరకు.. గ్రామానికి చెందిన మణిగిళ్ల కోటయ్య (55) అమ్మపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి వద్ద పశువుల కాపరిగా పని చేస్తుండేవాడు. కోటయ్యకు భార్య అలివేలమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కోటయ్య రోజు అమ్మపల్లికి వెళ్లి పశువులు కాసి తిరిగి రాత్రి ఇంటి వచ్చేవాడు. నాలుగు రోజులుగా పనికి వెళ్లకుండా గ్రామంలోనే ఉంటూ తాగొచ్చి డబ్బుల విషయమై భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తాగి వచ్చి భార్యతో గొడవ పడగా ఆగ్రహానికి గురై కర్రతో కోటయ్య తలపై మోదడంతో కిందపడ్డాడు. అంతటితో ఆగకుండా తలను పట్టుకొని గోడకు బాధడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటికొచ్చిన చిన్న కుమారుడు రమేశ్ రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి భయాందోళనకు గురై బంధువులు, గ్రామస్తులు, మేనత్త రాములమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దమందడి ఎస్‌ఐ శివకుమార్ వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కోటయ్య చెల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు శుక్రవారం ఉదయం గ్రామంలో విచారణ చేపట్టి భార్య అలివేలమ్మను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు సీఐ రాంబాబు, ఎస్‌ఐ వివరించారు.
రిమాండ్‌కు తరలించిన పోలీసులు