
1,800 కేజీల నల్లబెల్లం పట్టివేత
కేటీదొడ్డి: అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్న ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని నందిన్నె చెక్‌పోస్టు వద్ద ఎకై ్సజ్ సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా రాయచూర్ నుంచి కొల్లాపూర్‌కు ఆటోలో తరలిస్తున్న 60 బ్యాగుల్లో (1800 కేజీలు) నల్లబెల్లాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. వాహన డ్రైవర్ భరత్‌సింగ్, మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. తనిఖీలో ఎకై ్సజ్ ఎస్‌ఐ లింగస్వామి, జగదీష్, శేఖర్‌నాయుడు, రాములు పాల్గొన్నారు.
1,200 కిలోలు..
కోయిల్‌కొండ: మండల కేంద్రంలో గురువారం 1,200 కిలోల నల్లబెల్లం పట్టుకొని కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తిరుప్పాజీ తెలిపారు. ఆయన కథనం మేరకు.. పట్టణంలోని మైసమ్మ గేటు వద్ద గురువారం తెల్లవారుజామున వాహన తనిఖీలు చేపడుతుండగా మద్దూర్ నుంచి వస్తున్న బొలెరో వాహనంలో రూ.60 వేల విలువైన నల్లబెల్లాన్ని గుర్తించామన్నారు. డ్రైవర్ సురేష్‌ను విచారించగా కర్ణాటక గుర్మిట్కల్ నుంచి నాగర్‌కర్నూల్‌కు తరలిస్తున్నామని చెప్పారని.. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసునమోదు చేసినట్లు వివరించారు.

1,800 కేజీల నల్లబెల్లం పట్టివేత